Bollywood Actor Ranjan Sehgal Death: బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత

Bollywood Actor Ranjan Sehgal Death: బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టీవీ నటుడు రాజన్‌ సెహగల్ జూలై 11 న పంజాబ్ చండీగర్ లోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Raj
By Raj
Updated on: 12 July 2020 6:32 PM IST
Bollywood Actor Ranjan Sehgal Death: బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు కన్నుమూత
X
Ranjan Sehgal (File Photo)

Bollywood Actor Ranjan Sehgal Death: బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. టీవీ నటుడు రాజన్‌ సెహగల్ జూలై 11 న పంజాబ్ చండీగర్ లోని ఒక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. రాజన్‌ సెహగల్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, అవయవ వైఫల్యం కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ఐశ్వర్యరాయ్‌, రణదీప్ హుడా జంటగా నటించిన సరబ్జిత్‌ చిత్రంలో రాజన్‌ సెహగల్‌ నటించారు. ఆయన పలు టీవీ సీరియల్ లలో కూడా నటించారు. క్రైమ్‌ పెట్రోల్‌, తుమ్‌ దేనా సాత్ మేరా, సావధాన్‌ ఇండియా టీవీ ప్రోగ్రాములలో నటించారు. రాజన్‌ సెహగల్ మృతిపట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ) ట్విట్టర్‌ ద్వారా నివాళి అర్పించింది. కాగా, 2010 నుంచి రాజన్‌ సీఐఎన్‌టీఏఏ సభ్యునిగా ఉన్నారు.

కాగా ఇటీవల ప్రముఖ హాస్యనటుడు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ, అలియాస్ జగదీప్ కూడా ముంబైలో మరణించిన సంగతి తెలిసందే. ఆయన వయసు 81. దర్శకుడు బిఆర్ చోప్రా యొక్క 1951 చిత్రం అఫ్సానాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా జగదీప్ తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాడు. బాల నటుడిగా అబ్ దిల్లీ డోర్ నహిన్, మున్నా, ఆర్ పార్ , దో బిఘా జమీన్ వంటి చిత్రాలలో నటించారు. ఆయన దాదాపు 400 కి పైగా చిత్రాల్లో నటించారు.



Raj

Raj

Next Story