AP Corona Updates: ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

AP Corona Updates: ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్రత భారీగా పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయగా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Karampoori Rajesh
Published on: 11 Aug 2020 8:14 PM IST
AP Corona Updates: ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి
X
Coronavirus updates in AndhraPradesh 9,024 New cases registered in 24 hours

AP Corona Updates: ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్రత భారీగా పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,315 మందికి కరోనా టెస్టులు చేయగా, ఏకంగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,41,654కు చేరాయి. అలాగే 24 గంటల్లో కొత్తగా 87 మంది మృతి చెందగా, ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 2203కి పెరిగింది.

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 58,315 శాంపిల్స్‌ ని పరీక్షించగా 9,024 మంది క‌రోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో.. కరోనా వల్ల కొత్తగా అనంతపూర్‌ లో 13 మంది, చిత్తూరులో 12మంది, గుంటూరులో 9మంది, ప్రకాశం లో 7, విశాఖపట్నం లో 7, కడప లో 6, శ్రీకాకుళం లో 6, పశ్చిమ గోదావరి లో 6, తూర్పు గోదావరిలో 5, నెల్లూరు లో 5, విజయనగరం లో 5, కృష్ణ లో 3, కర్నూల్‌ లో ముగ్గురు మరణించారు.

ఇక గడచిన 24 గంటల్లో 9,113 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,41,654 పాజిటివ్ కేసులకు గాను.. 1,51,854 మంది డిశ్చార్జ్ కాగా.. 2,203 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,597 గా ఉంది.

కాగా జిల్లాల వారీగా కొత్త కేసులుః అనంతపురంలో 959, చిత్తూరులో 758, తూర్పు గోదావరిలో 1372, గుంటూరులో 717, కడపలో 579, కృష్ణాలో 342, కర్నూలులో 1138, నెల్లూరులో 364, ప్రకాశంలో 343, శ్రీకాకుళంలో 504, విశాఖలో 676, విజయనగరంలో 594, పశ్చిమ గోదావరిలో 678 కేసులు నమోదయ్యాయి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story