రెండవ దశ టీకా ప్రయోగానికి నిమ్స్‌ సన్నద్ధం

రెండవ దశ టీకా ప్రయోగానికి నిమ్స్‌ సన్నద్ధం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

First Phase Clinical Trials Complete In Nims : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఆస్పత్రిలో భారత్ బయోటకె సంస్థ తయారు చేసిన కొవాక్జిన్‌ కరోనా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది.

First Phase Clinical Trials Complete In Nims : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఆస్పత్రిలో భారత్ బయోటకె సంస్థ తయారు చేసిన కొవాక్జిన్‌ కరోనా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ను మొత్తం 50 మంది వలంటీర్లపై చేసారు. కాగా నిమ్స్‌ వైద్యులు ప్రస్తుతం పూర్తి పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఆదేశాల మేరకు సుమారుగా 60 మందికి పైగా కరోనా బాధితులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నుంచి ఓ 50 మందిని గుర్తించి వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం సమగ్రంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం ఆయా వలంటీర్ల ఫిట్‌నెస్‌ను ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌ సైతం పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది.

అనంతరం కరోనా నియంత్రణ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్‌(బీబీఐఎల్‌) సంస్థ కనుగొన్న కోవాక్జిన్‌ ఫేజ్‌–1 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌ను మొదలు పెట్టారు. ఈ ట్రయల్స్ లో ముందుగా ఆరోగ్యకమైన ఇద్దరు వలంటీర్లపై మొదటి మోతాదు టీకా ప్రయోగం చేశారు. ఆ తరువాత ట్రయల్స్ ప్రక్రియను కొనసాగిస్తూ ఈ నెల మొదటి వారంలో మొదటి క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేశారు. ఈ ట్రయల్స్ లో భాగంగా మరో 14 రోజుల తరువాత కరోనాకు సంబంధించిన ఓ బూస్టర్‌ డోస్‌ను కూడా ఇచ్చారు. నిమ్స్‌ వైద్యులు ఈ ప్రక్రియను కూడా ఇటీవలే పూర్తి చేసినట్టు పేర్కొంటున్నారు. క్లినికల్‌ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్‌ వైద్యులతో పాటు జనరల్‌ మెడిసిన్, ఆనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన వైద్యులు సమన్వయంతో నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె. మనోహర్‌ పర్యవేక్షణలో ఈ ట్రయిల్స్‌ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కు ముందుకొచ్చిన వాలంటీర్లు వారి వారి ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవాల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ వ్యాక్సిన్‌ కారణంగా శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వలంటీర్ల ఆరోగ్యాన్ని పరిక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాదు వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. 28 రోజుల తర్వాత రెండవ మోతాదు టీకా ప్రయోగానికి నిమ్స్‌ క్లినికల్‌ ట్రయిల్‌ నోడల్‌ అధికారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే రెండవ మోతాదు టీకా ప్రయోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.
Show Full Article
Print Article
Next Story
More Stories