Viral Video: ఇదేం ఆచారం సామీ.. పెళ్లి కొడుకు తలను బద్ధలు కొట్టేస్తున్నారు. వైరల్ వీడియో
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి ముహుర్తాలు బాగా ఉండడంతో ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి.
Viral Video: ఇదేం ఆచారం సామీ.. పెళ్లి కొడుకు తలను బద్ధలు కొట్టేస్తున్నారు. వైరల్ వీడియో
Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి ముహుర్తాలు బాగా ఉండడంతో ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కాగా దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వివాహ వేడుకలు జరుగుతాయి. ఆయా ప్రాంతాల వారీగా ఆచారాలు ఉంటాయి.
అయితే కొన్ని ఆచారాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ విచిత్రమైన ఆచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి ఆచారం సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపంలో ఒక పెళ్లి కొడుకు కూర్చుకన్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి తల మీద కొబ్బరి బొండంను పగలగొడుతున్నాడు. కొబ్బరికాయతో అదేపనిగా వరుడి తలపై కొడుతున్నాడు. అతను కూడా ఏమాత్రం రియాక్ట్ అవకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ కొబ్బరి బొండంతో పదే పదే కొడుతూనే ఉన్నాడు.
చివరికి కొబ్బరి బొండం పగిలేంత వరకు కొడుతూనే ఉన్నాడు. చివరికి పెళ్లి కొడుకు తలను కిందికి వంగడంతో ఆపేశాడు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇదేక్కడి వింత ఆచారంరా సామీ.. పెళ్లి కాదు.. ముందు తలపగిలి చాస్తవ్ అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.