Akividu: ఆకివీడు ఉప్పుటేరు మహిళ అనుమానాస్పద మృతి కేసు ఛేదన!

Akividu: ఆకివీడు ఉప్పుటేరులో లభ్యమైన ఉప్పాడ దేవి మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు. ఎడమ కాలు రాడ్ సీరియల్ నంబర్ ఆధారంగా భర్త నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.

Update: 2026-08-25 07:46 GMT

Akividu: ఆకివీడు ఉప్పుటేరు మహిళ అనుమానాస్పద మృతి కేసు ఛేదన!

Akividu: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో ఉప్పుటేరు తుప్పల్లో కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఛేదించారు. కుటుంబ కలహాలు, భార్యపై ఉన్న అనుమానమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. సొంత భార్యనే దారుణంగా హత్య చేసి ఉప్పుటేరులో పడేసిన భర్త నారాయణరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

​అపార్ట్‌మెంట్‌లో హత్య.. ఉప్పుటేరులో మృతదేహం లభ్యం పోలీసుల కథనం ప్రకారం.. భీమవరంలోని సాయి వంశీకృష్ణ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న నారాయణరావుకు ఆయన భార్య ఉప్పాడ దేవితో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. భార్య ప్రవర్తనపై తీవ్ర అనుమానం పెంచుకున్న నారాయణరావు, ఇంట్లోనే ఆమెతో గొడవపడి ఆవేశంలో గొంతు నులిమి హత్య చేశాడు.

​హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు పక్కా పథకం వేశాడు. అర్ధరాత్రి వేళ మృతదేహాన్ని తన కారులోకి ఎక్కించుకుని భీమవరం నుంచి ఆకివీడు వైపు బయలుదేరాడు. ఎవరికీ అనుమానం రాకుండా, మృతదేహం త్వరగా కానరాకుండా ఉప్పుటేరు వంతెన సమీపంలోని దట్టమైన తుప్పల్లో పడేసి అక్కడ నుంచి

​స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. తొలత మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారింది. అయితే వైద్యులు అందించిన పోస్ట్‌మార్టం నివేదిక ఈ కేసులో ప్రధాన తిరుగులేని ఆధారంగా మారింది.

​ మృతురాలి ఎడమ కాలుకు గతంలో శస్త్రచికిత్స జరిగి, అక్కడ స్టీల్ ప్లేట్, రాడ్, ప్రత్యేక స్క్రూలు అమర్చినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది.

​ఆ స్క్రూలు, సర్జికల్ పరికరాల సీరియల్ నంబర్లు, బ్రాండ్ వివరాల ఆధారంగా పోలీసులు సమీపంలోని అస్థిపంజర (ఆర్థోపెడిక్) ఆస్పత్రుల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.శస్త్రచికిత్స చేసుకున్న బాధితురాలి వివరాలను సరిపోల్చగా, ఆ మృతదేహం ఉప్పాడ దేవిదేనని పక్కాగా ధ్రువీకరించుకున్నారు.

​మృతురాలి వివరాలు తేలడంతోనే ఆమె భర్త నారాయణరావుపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట నాటకమాడినా, పోలీసులు తమ వద్ద ఉన్న శాస్త్రీయ ఆధారాలను ముందుంచడంతో నారాయణరావు తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

​సకాలంలో ఆధారాలు సేకరించి, సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ విచారణ ఆధారంగా కేసును త్వరితగతిన ఛేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ పొలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడు నారాయణరావుపై హత్య మరియు ఆధారాలు మాయం చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News