Penumantra: ఏఈ నూకరాజు కుటుంబ మృతి కేసు: పెనుమంట్ర పీఎస్‌లో బీజేపీ ఫిర్యాదు!

Penumantra: గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకుడైన షేక్ సాధిక్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు.

Update: 2026-08-24 13:30 GMT

Penumantra: ఏఈ నూకరాజు కుటుంబ మృతి కేసు: పెనుమంట్ర పీఎస్‌లో బీజేపీ ఫిర్యాదు!

Penumantra: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ గారి ఆదేశముల మేరకు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో పిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం రాజమండ్రి బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఆయన కుటుంబం.

మరణానికి కారణమైన షేక్ సాదిక్ ఖాన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మతాంతర వివాహాల విషయం లో ఏ విధమైన పిర్యాదులు అందినా వెంటనే ఇందులో ఏమైనా లవ్ జిహాద్ మరియు ఇతర కుట్ర పూరితమైన అంశములు వున్నావేమో అని సమగ్ర విచారణ చేసి బాదితులకు న్యాయం చేయాలని మరియు కుట్ర చేసే వాళ్లకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పెనుమంట్ర మండల అధ్యక్షులు G. మారుతీ కృష్ణ ఆధ్వర్యంలో పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గున్నేపల్లి పుల్లాజి, గోపే సుందర్రావు, కర్రీ కృష్ణారెడ్డి, యజమాల విశ్వనాథం , వాడపల్లి పృథ్వీరాజ్ మరియు పిల్లి భాను ప్రసాద్ పాల్గొన్నారు.

Tags:    

Similar News