Warangal: వరంగల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి. హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

Update: 2026-08-18 11:57 GMT

Warangal: వరంగల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, ఐఏఎస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,జెడ్పీ సీఈవో రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ. పుష్పలత, సహాయ అధికారి శంకరయ్యతో పాటు గౌడ కుల సంఘ నాయకులు చిర్ర రాజు గౌడ్, గట్టు రమేష్ గౌడ్, డాక్టర్‌ లక్ష్మీనారాయణ, అనంత రమేష్ గౌడ్, లక్ష్మణ్, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బహుజనుల కోసం పోరాడి, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న గౌడ్ బహుజనుల కోసం పాలకులను ఎదిరించి, స్వరాజ్యాన్ని స్థాపించి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌడ కుల సంఘ నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News