Mahabubabad: ఇనుగుర్తి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
Mahabubabad: ఇనుగుర్తి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మొదట గురుకుల పాఠశాల లోని ఫిర్యాదుల పెట్టెలో ఉన్న ఫిర్యాదు లను పరిశీలించారు. గురుకుల పాఠశాల లోని తరగతి గదులు , డైనింగ్ హాల్ , వంట శాల మరియు విద్యార్థుల వసతి గదులను క్షుణంగా పరిశీలించి... విద్యార్ధినిల సమస్యలను అడిగి తెలుసుకన్నారు.
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు