Thorrur: పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు!

Thorrur: తొర్రూరు (జే) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ప్రారంభించారు.

Update: 2026-07-03 05:19 GMT

Thorrur: పాలకుర్తి నియోజకవర్గంలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు!

తొర్రూరు: నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పులి స్వర్ణ-రాజు,గోనె అనసూర్య-బుచ్చయ్య,పులి రేణుక-యాకయ్య,రాగేరు భాగ్యమ్మ-గుట్టయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించి,గృహప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని,అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని,ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,అధికారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News