Mahabubabad: మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ హత్య భార్యే సూత్రధారి!

Mahabubabad: మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆస్తి కోసం రూ.4 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య యశోద అరెస్ట్.

Update: 2026-07-04 12:50 GMT

Mahabubabad: మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ హత్య భార్యే సూత్రధారి!

మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో ఈ నెల 1వ తేదీ తెల్లవారు జామున మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) ని హత్య చేసిన 7రు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన మీడియా సమావేశం లో అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శబరిష్.

వివాహేతర సంబంధం , ఆస్తి గొడవలే హత్యకు కారణం. యాకయ్య కు గ్రామం లో మరో మహిళతో వివాహేతర సంబంధం. ఆస్తిని ఆ మహిళకు రాసిస్తాడనే భయంతో భర్త ను హత్య చేసేందుకు 4 లక్షల రూపాయల సుఫారీ మాట్లాడిన భార్య యశోద ( 53 ) యాకయ్య ను ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేసి .. మెడ లోని బంగారు గొలుసు ను తీసుకొని పరారైన దుండగులు.

భార్య యశోధ మరో 6 రు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు. 7 సెల్ ఫోన్లు , ఐరన్ రాడ్ , 2 ద్విచక్ర వాహనాలు , 1 బంగారు గొలుసు సీజ్...

Tags:    

Similar News