Vijayawada: స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ.100 కోట్ల నెట్‌వర్క్ ఫ్రాడ్

Vijayawada: స్క్రబ్బర్ వ్యాపారంలో భారీ లాభాల పేరుతో 'మాషా అల్లా ఎంటర్ప్రైజెస్' సీఈఓ పసుపులేటి అంకుశం ఏపీ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా మోసం చేసి పరారయ్యాడు.

Update: 2026-08-14 08:52 GMT

Vijayawada: స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ.100 కోట్ల నెట్‌వర్క్ ఫ్రాడ్

Vijayawada: విజయవాడలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ సీఈఓ పసుపులేటి అంకుశం అనే వ్యక్తి స్క్రబర్ల్ వ్యాపారం పేరుతో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురుని మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. కేవలం ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూసి స్క్రబ్బర్ల తయారీ సీఈఓ తో పరిచయం అయినట్లు లాభదాయకమైన విషయాలు తెలిపి కొన్ని స్క్రబ్బర్లను స్క్రబ్బర్ తయారీకి వాడే మిషన్ అందించడంతో పాటు నెలనెలా జీతాలు ఇస్తామంటే ఆశపడి.

మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులు పెట్టామని పెట్టిన కొద్దిరోజుల్లోనే సీఈఓ పసుపులేటి అంకుశం బండారం బయటపడిందని నందిగామ నియోజకవర్గంలో 50 మంది బాధితులు సుమారు కోటి రూపాయల నగదుతన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న తర్వాత నుండి పరారయ్యారని బాధితులు తెలిపారు.

అంతేకాకుండా ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 2వేల మందిని మోసం చేసి 100 కోట్ల తో పరారైనట్లు బాధితులు వాపోయారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయంలో పంటల పండక స్క్రబ్బర్ ఈ వ్యాపారంతో నైనాతమ జీవనోపాధి కలుగుతుందని ఉద్దేశంతో స్క్రబ్బర్ వ్యాపారం లో పెట్టుబడి పెట్టామని. సీఈవో మోసం చేయడంతో తమ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందని సంబంధిత అధికారులు తమ యొక్క పరిస్థితిని గుర్తించి పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇప్పించాలని బాధితులు వాపోయారు.

Tags:    

Similar News