Vijayawada: విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్‌పై దాడిపై DCC సీరియస్
Vijayawada: కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడిని శ్రీసత్యసాయి జిల్లా DCC అధ్యక్షుడు షానవాజ్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కదిరిలో డిమాండ్ చేశారు.
Vijayawada: విజయవాడ కాంగ్రెస్ ఆఫీస్‌పై దాడిపై DCC సీరియస్
విజయవాడ: శ్రీ సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు KS షానవాజ్ కదిరిలో మీడియా ప్రకటన ద్వారా
విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం పై దాడిని ఖండించారు.
బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై
దాడి హేయమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. స్వయంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాయకత్వం వహించడం
బిజెపి గుండా రాజ్ కి పరాకాష్ట, ఇది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలు చించి వేసి
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ పై
బిజెపి మూకలు దాడి చేసి గాయపరచడం
సిగ్గుమాలిన చర్య, బిజెపి గుండాయిజానికి మచ్చుతునక అన్నారు.
కాంగ్రెస్ కార్యాలయం పై ఆకస్మిక దాడిని
వీరోచితంగా పోరాడి ఎదుర్కొన్న విద్యార్థి ,యువజన నాయకులను,
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజా ను వారి బృందాన్ని
విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ నాయకులను
కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది.
కూటమి ముసుగులో
బిజెపి అనే విష సర్పానికి చంద్రబాబు పాలు పోసి పెంచుతున్నారని,
ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని
పవన్ కళ్యాణ్ ని బిజెపి కాటు వేయక తప్పదని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడిన బిజెపి రాక్షస మూకలపై చట్టపర మైన చర్యలు
తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.