News Analysis: ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై బీజేపీ నేత విట్టల్ తీవ్ర విమర్శలు!

News Analysis: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదికపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు విట్టల్ పాల్గొని ప్రభుత్వ తీరుపై పలు కీలక విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మేనిఫెస్టో హామీల అమలు, రియల్ ఎస్టేట్ రంగం మందగించడం వంటి అంశాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక కేవలం ప్రచార అంశాలకే పరిమితం అయిందని, అసలైన మేనిఫెస్టో హామీల అమలుపై స్పష్టత లేదని విట్టల్ విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు, రైతులకు రూ.15,000, మహిళలకు రూ.2,500 మరియు వృద్ధులకు రూ.4,000 పెన్షన్ల వంటి హామీలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందని ఆయన డిమాండ్ చేశారు.