Off The Record: కామారెడ్డిలో సంచలనం సృష్టిస్తున్న షబ్బీర్ అలీ ఆడియో లీక్
Off The Record: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు ముదిరాయి.
Off The Record: కామారెడ్డిలో సంచలనం సృష్టిస్తున్న షబ్బీర్ అలీ ఆడియో లీక్
Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు బర్నింగ్ టాపిక్‌గా మారిపోయాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూప్‌వార్‌లు..అసమ్మతి నేతల కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. పార్టీలో ఓ ముఖ్యనేతను ఉద్దేశించి.. మరో కీలక లీడర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలను సైతం షేక్ చేస్తున్నాయి. అసలు ఆయన అన్నది ఎవర్ని.. జిల్లాలో ఆ ముఖ్యనేత తీరు పట్ల అసంతృప్తితోనే ఇలా మాట్లాడారా అన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగానే..మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం హిందూపై అసభ్యకర పోస్టులు.. పార్టీలో మరోసారి గ్రూప్ వివాదాలకు ఆజ్యం పోసినట్టైంది.
మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం హిందూను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ ఒకటి చక్కర్లు కొట్టింది. దీంతో ఇప్పటికే ఉన్న వివాదం కాస్త మరింత పెద్దదయింది. తన ఎదుగుదలను ఓర్వలేకే కొందరు టార్గెట్ చేస్తున్నారని, దీని వెనకున్న వ్యక్తులకు ఖబర్దార్ అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడినట్లు ఆడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఇందులో పార్టీతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చకు తెరలేపాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఇందు ప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఓ పత్రికల్లో వచ్చినట్లుగా క్రియేట్ చేసిన అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశారు. ఆమెను టార్గెట్ చేస్తూ వాట్సాప్ గ్రూపు, ఫేస్ బుక్‌లలో దానిని వైరల్ చేశారు. కాంగ్రెస్ గ్రూపులో దాన్ని పోస్ట్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇందుపియా వెంటనే స్పందించి తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ఎస్పీని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు
ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో...కామారెడ్డి కాంగ్రెస్‌లో కలకలం రేగింది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలు, ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందట. ఈ నేపథ్యంలోనే ఆయన వివరణ కోరింది. గతంలో షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డికి కూడా పిసిసి షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందుకు తీసుకెళ్లడం తోటి నాయకుడిపై బహిరంగ విమర్శలు చేయడం కూడా క్రమశిక్షణ రాహిత్యమేనని భావించిన అధిష్టానం ఆయనకు నోటీసులు ఇచ్చింది.
ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు తాము ఎవరితో తిరగాలో అర్థంకాక కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట. ఈ ఘటనపై స్పందించిన ఇందుప్రియ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐతే హిందూ ప్రియ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ వర్గం మండిపడుతోంది. నిరాధార ఆరోపణలు మానుకోవాలని, టిఆర్ఎస్ లో సస్పెండ్ చేస్తే పార్టీలో చేర్చుకొని పదవులు ఇప్పించిన నాయకునిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కామారెడ్డిలో సీనియర్ నేతల మధ్య ఈ మాటల యుద్ధం క్యాడర్లో గందరగోళం సృష్టిస్తుంది. ఐతే తనపై కావాలనే కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడని సమాచారం.