BurningTopic: పుతిన్ కు దిమ్మదిరిగే షాక్?

BurningTopic: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రష్యాలోని మాస్కో, యారోస్లావ్ల్ చమురు రిఫైనరీలపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడి.

Update: 2026-07-01 00:50 GMT

BurningTopic: పుతిన్ కు దిమ్మదిరిగే షాక్?

BurningTopic: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గూబ గుయ్యిమనే షాక్ ఇచ్చారు. రష్యాలోని కీలకమైన ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. మాస్కో సమీపంలోని కపోత్న్యా ఆయిల్ రిఫైనరీతోపాటు యారోస్లావ్ల్, స్లావ్యన్స్క్ రిఫైనరీలపై డ్రోన్‌లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది.

ఫలితంగా రష్యా దేశీయంగా తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. పుతిన్ స్వయంగా ఇంధన కొరతను అంగీకరించారు. భవిష్యత్‌లో చమురు కేంద్రాలకు రక్షణ పెంచుతామని తేల్చిచెప్పారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూలలో వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇంధన రేషనింగ్ విధానాన్ని అధికారులు అమలు చేశారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరో దశకు చేరుకుంది. రెండు దేశాలు యుద్ధభూమిలో భీకరంగా పోరాడుతునే ఒకరి ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలను మరొకరు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యా చమురు నిక్షేపాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ వరుసగా నిర్వహిస్తున్న దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో రష్యాలోని పలు కీలక చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, ఆయిల్ డిపోలు దెబ్బతిన్నాయి. దీంతో దేశీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Full View


Tags:    

Similar News