News Analysis: రాజకీయం శాశ్వతం కాదు.. రైతుల ప్రాణాలు ముఖ్యం: బీఆర్ఎస్!

News Analysis: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో మళ్లీ రాజకీయ రణరంగం మొదలైంది.

Update: 2026-07-13 05:43 GMT

News Analysis: రాజకీయం శాశ్వతం కాదు.. రైతుల ప్రాణాలు ముఖ్యం: బీఆర్ఎస్!

News Analysis: గోదావరి నదిలో వరద నీరు ఉప్పొంగుతున్నా, తెలంగాణలో రైతు మాత్రం సాగునీటి కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ (BRS) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నేపల్లి పంప్ హౌస్‌ను వెంటనే ప్రారంభించి రైతాంగానికి నీరందించాలని బీఆర్ఎస్, బీజేపీలు డిమాండ్ చేస్తుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పట్లో అది సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంటీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక డిబేట్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు.

డిబేట్‌లో బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని కంప్లీట్ గా రిపేర్ చేసుకొని తిరిగి వినియోగంలోకి తీసుకోవచ్చని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడ కూడా ఉన్నతాధికారులు, నిపుణులు ఉన్నారని, వారితో ఒక జాయింట్ కమిటీ వేసి తనిఖీలు చేయించి ప్రాజెక్టును ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

Full View

Tags:    

Similar News