Tirupati: మల్లవరంలో కాలువ భూముల కబ్జా.. చర్యలకు టీడీపీ నేత డిమాండ్

Tirupati: తిరుపతి రూరల్ మండలం మల్లవరంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ కాలువ భూమి కబ్జాపై టీడీపీ నేత మనోహర్ చౌదరి ఆరోపణ. అధికారుల చర్యలకు స్థానికుల డిమాండ్.

Update: 2026-08-23 10:41 GMT

Tirupati: మల్లవరంలో కాలువ భూముల కబ్జా.. చర్యలకు టీడీపీ నేత డిమాండ్

తిరుపతి: తిరుపతి రూరల్ మండలం మల్లవరం లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాదారులు విచ్చలవిడిగా కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్నారు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు ఇటీవల జిల్లా కలెక్టర్ కు తెలుగుదేశం పార్టీ మల్లవరం ఇంచార్జ్ మనోహర్ చౌదరి పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో తాసిల్దార్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని సందర్శించి పనులు ఆపి వేయించారు. మళ్లీ ఇప్పుడు కాల్వ భూమి లో దారి ఏర్పాటుకు పనులు చేపడుతున్నారు సర్వేనెంబర్ 49 లో రెండు ఎకరాల పైగా ప్రభుత్వ కాలువ భూమి ఉంది అదే గ్రామానికి చెందిన మాజీ టిడిపి నాయకుడు భూమిలో లే అవుట్ ఏర్పాటు చేసేందుకు చదును పనులు చేపట్టారు.

ఇందులోకి వెళ్లేందుకు దారి కోసం పట్టా భూమితో పాటు పక్కనే ఉన్న కొంత కాలువ గడ్డ ప్రభుత్వ భూమి చదును చేసి కలిపేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు మనోహర్ చౌదరి ఆరోపిస్తున్నారు జాతీయ రహదారికి దగ్గరగా కాలువ గడ్డ ప్రభుత్వ భూమి ఉండడంతో ప్రస్తుతం మార్కెట్ ప్రకారం దీని విలువ కోట్లల్లో ఉంటుందన్నారు రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News