Tirupati: ‘ఆకర్ష్ ఇన్’ హోటల్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Tirupati: తిరుపతి తిరుచానూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఆకర్ష్ ఇన్' హోటల్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
Tirupati: ‘ఆకర్ష్ ఇన్’ హోటల్‌ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తిరుపతి: తిరుపతి టౌన్‌లోని తిరుచానూరు రోడ్డులో స్టార్‌బక్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆకర్ష్ ఇన్ హోటల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆకర్ష్ ఇన్ యజమాని ఆకర్ష్ గారి , కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. నూతనంగా ప్రారంభమైన ఆకర్ష్ ఇన్ హోటల్ ప్రజలకు నాణ్యమైన ఆతిథ్య సేవలు అందిస్తూ మంచి ఆదరణ పొందాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.