Srikalahasti: బొణుపల్లి గ్రామంలో పోలీసుల ‘పల్లె నిద్ర’ నిర్వహణ

Srikalahasti: శ్రీకాళహస్తి బీఎన్ కండ్రిగ సర్కిల్ పరిధిలోని బొణుపల్లి గ్రామంలో సీఐ, తొట్టంబేడు ఎస్ఐ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహణ.

Update: 2026-08-22 17:43 GMT

Srikalahasti: బొణుపల్లి గ్రామంలో పోలీసుల ‘పల్లె నిద్ర’ నిర్వహణ

శ్రీకాళహస్తి: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారికి పోలీసులపై మరింత నమ్మకం కల్పించేందుకు చేపడుతున్న పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా బీఎన్‌ కండ్రిగ సర్కిల్‌ సీఐ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్‌ఐతో కలిసి బొణుపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.

హైపర్‌ సెన్సిటివ్‌ గ్రామంగా గుర్తించిన బొణుపల్లిలో గ్రామస్థులతో పోలీసులు ముఖాముఖిగా మాట్లాడి వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తత, మహిళలపై జరిగే నేరాల నివారణ, రహదారి భద్రత వంటి అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఏదైనా సమస్య లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఎన్‌ కండ్రిగ సీఐ, తొట్టంబేడు ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News