Puttur: ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు

Puttur: తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీ ద్రౌపతీ దేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ ప్రవేశం. భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు.

Update: 2026-08-23 17:11 GMT

Puttur: ద్రౌపతీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు

పుత్తూరు: పుత్తూరు శ్రీ ద్రౌపతి దేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అగ్ని గుండ ప్రవేశం వైభవంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ నుంచి బ్రిడ్జి కింద వరకు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.

దీంతో వాహనదారులు గంట మేరకు ట్రాఫిక్ తో సతమతమయి... చాలా ఇక్కట్లు పడ్డారు.ట్రాఫిక్కును క్లియర్ చేయని నేపథ్యంలో పోలీసులపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News