Sullurupeta: పెళ్లకూరులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ భారీ ప్రజా దర్బార్!

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో భారీ ప్రజా దర్బార్ నిర్వహించారు.

Update: 2026-05-23 10:49 GMT

Sullurupeta: పెళ్లకూరులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ భారీ ప్రజా దర్బార్!

తిరుపతి: పెళ్లకూరు గత పదేళ్ల పాలనలో తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో తీవ్రంగా వెనుకబడిందని, కనీసం రహదారులపై పడిన గుంతల్లో మట్టి వేసి పూడ్చే నాథుడు కూడా కరువయ్యారని శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం పెళ్లకూరు మండల కేంద్రంలో ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా భారీ "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేడని, కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే పల్లెపండుగ కింద రూ.35 కోట్ల భారీ నిధులతో నియోజకవర్గవ్యాప్తంగా సిసి రోడ్ల పనులను పూర్తి చేసి సమూల మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. అధికారులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఈ దర్బార్‌లో అందిన 40 అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

​అర్హులైన పేదలకు కలెక్టర్, సీఎం ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు తహశీల్దార్ కు తక్షణమే సర్వే చేపట్టాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని హెచ్చరించారు. అలాగే వర్షాకాలం లోపు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు మరమ్మతులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఏఈని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News