Tirupati: చంద్రగిరిలో దారుణం.. దళితుల ఇంటి స్థలాలు డాక్టర్ కబ్జా!
Tirupati: ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను ఓ స్థానిక వైద్యుడు దౌర్జన్యంగా ఆక్రమించి ఫెన్సింగ్ వేస్తున్నాడంటూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirupati: చంద్రగిరిలో దారుణం.. దళితుల ఇంటి స్థలాలు డాక్టర్ కబ్జా!
తిరుపతి: చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. దళితులకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలు ఇప్పుడు ఒక వైద్యుడి కబ్జాలో చిక్కుకున్నాయి.దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేస్తూ స్థలాలను ఆక్రమిస్తుంటే, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
చంద్రగిరి మండలం, కొత్తశానంబట్ల హరిజనవాడలో ఈ వివాదం నెలకొంది. దాదాపు 20 ఏళ్ల క్రితం దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంటి పట్టాలను పంపిణీ చేసింది. అయితే, ఇన్నాళ్లుగా ఆ స్థలాలను తమ నివాసాలకు వాడుకుంటున్న దళితులపై, అదే గ్రామానికి చెందిన ఓ వైద్యుడు కన్ను పడింది.ఎటువంటి అనుమతులు లేకుండా, దౌర్జన్యంగా ఆ స్థలాలను ఆక్రమించి,ఫెన్సింగ్ వేసే పనులను ఆ వైద్యుడు.
చేపడుతున్నాడని బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు దిక్కూమొక్కూ లేదని,ఈ అన్యాయంపై స్థానిక రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, వారు మొద్దు నిద్ర వీడటం లేదని బాధితులు వాపోతున్నారు.అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఆ వైద్యుడి ప్రభావం ఏమైనా ఉందా? లేక అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆక్రమణలను తొలగించి దళితులకు అన్యాయం జరగకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.