Hyderabad: కార్తిక దీపం మిగిల్చిన విషాదం.. చీరకు నిప్పంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
Hyderabad: కార్తిక దీపం మిగిల్చిన విషాదం.. చీరకు నిప్పంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!
Hyderabad: కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తిక దీపం ప్రమాదవశాత్తు చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18), రోడ్ నంబర్ 5లో 'ఎస్ఎస్ బొటిక్' నిర్వహిస్తోంది. ఈ నెల 12న రాత్రి బొటిక్ మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తిక దీపం ప్రమాదవశాత్తు ఆమె చీరకు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో సింధు తీవ్రంగా గాయపడింది.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన సింధు, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. చేతికి అందివచ్చిన కుమార్తె అకాల మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.