Manikonda: ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం.. 18 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్!
Manikonda: గ్రేటర్ హైదరాబాద్ శివారు మణికొండలో అయ్యప్ప పూజ ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఉదయ్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Manikonda: ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదం.. 18 ఏళ్ల యువకుడు స్పాట్ డెడ్!
మణికొండ: మణికొండలో అయ్యప్ప స్వామి పూజ కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ క్వార్టర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఉదయ్ (18) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
సాయి అనే వ్యక్తి కి కూడా విద్యుత్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయ్యప్ప పూజల సందడి ఉండాల్సిన చోట యువకుడి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.