Hyderabad Traffic Alert: మార్చి 20న పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు.. చార్మినార్ వైపు నో ఎంట్రీ!
Hyderabad Traffic Alert: మార్చి 20న జుమ్మత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు.
Hyderabad Traffic Alert: మార్చి 20న పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు.. చార్మినార్ వైపు నో ఎంట్రీ!
Hyderabad Traffic Alert: హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ సందడి పీక్స్‌కు చేరుకుంది. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో 'జుమ్మత్-ఉల్-విదా' ప్రార్థనల కోసం చారిత్రాత్మక మక్కా మసీదు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కీలకమైన ఆంక్షలు, దారి మళ్లింపులను ప్రకటించారు. చార్మినార్ , మక్కా మసీదు పరిసరాల్లో ప్రార్థనల సమయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కింది మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ప్రధాన దారి మళ్లింపులు ఇవే
చార్మినార్‌కు దారితీసే అన్ని ప్రధాన రహదారులను వాహనాల రాకపోకలకు మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఇలా ప్లాన్ చేసుకోండి:
మదీనా జంక్షన్ : నయాపుల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు.
హిమ్మత్‌పురా: శాలిబండ, నాగుల్‌చింత నుండి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా వద్ద హరి బౌలి వైపు మళ్లిస్తారు.
ముర్గీ చౌక్: మోతీ గల్లీ వైపు వెళ్లే వాహనాలను చౌక్ మైదాన్ వద్ద మళ్లిస్తారు.
ఎతెబార్ చౌక్: అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎతెబార్ చౌక్ వద్ద మళ్లిస్తారు.
సికింద్రాబాద్‌లో కూడా మార్పులు
సికింద్రాబాద్ పరిసరాల్లో ప్రార్థనల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుభాష్ రోడ్డును మూసివేస్తున్నారు. ఇక్కడి వాహనాలను రాణిగంజ్ , ప్యారడైజ్ జంక్షన్ల వైపు మళ్లించనున్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం పోలీసులు ఐదు ప్రధాన ప్రాంతాలను పార్కింగ్ కోసం కేటాయించారు. గుల్జార్ ఫంక్షన్ హాల్,ముఫీద్-ఉల్-అనామ్ గ్రౌండ్స్,చార్మినార్ బస్ టెర్మినల్, ఏయూ ఆసుపత్రి ప్రాంగణం, ఖిల్వత్ గ్రౌండ్ ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు
ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు
చార్మినార్ వైపు వెళ్లే TGSRTC బస్సులు అఫ్జల్‌గంజ్ వరకే నడుస్తాయి. జిల్లా వైపు వెళ్లే బస్సులను చాదర్‌ఘాట్, సైదాబాద్ , ఆరామ్‌ఘర్ మీదుగా మళ్లిస్తారు. అవసరమైతే అత్యవసర సేవల కోసం లేదా ఇతర సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చు. జుమ్మత్-ఉల్-విదా ప్రార్థనల వేళ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.