Hyderabad Metro: మెట్రోలో మళ్ళీ సాంకేతిక లోపం.. అమీర్‌పేట్ - రాయదుర్గం మార్గంలో నిలిచిన రైళ్లు!

Hyderabad Metro: నగరంలో మెట్రో ప్రయాణికులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.

Update: 2026-03-20 05:45 GMT

Hyderabad Metro: మెట్రోలో మళ్ళీ సాంకేతిక లోపం.. అమీర్‌పేట్ - రాయదుర్గం మార్గంలో నిలిచిన రైళ్లు!

Hyderabad Metro: నగరంలో మెట్రో ప్రయాణికులకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక కారణాల దృష్ట్యా బ్లూ లైన్ (Blue Line) మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా అమీర్‌పేట్ - రాయదుర్గం మధ్య నడిచే రైళ్లు పట్టాలపైనే నిలిచిపోయాయి.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్‌లో ఒక రైలు సుమారు 15 నిమిషాలుగా కదలకుండా నిలిచిపోయింది. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే మార్గంతో పాటు, రాయదుర్గం నుంచి అమీర్‌పేట్ వచ్చే రైళ్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మెట్రోలోనే బందీ అయ్యారు. టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే పనిలో ఉంది. త్వరలోనే సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు ప్రాథమికంగా తెలిపారు.

Tags:    

Similar News