Gadwal: గద్వాలలో ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఒకరు మృతి

Gadwal: గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Update: 2026-03-17 07:02 GMT

Gadwal :గద్వాలలో ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొని ఒకరు మృతి

Gadwal: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న బైక్‌ను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు, గాయపడిన వారు హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజ్‌కు చెందిన ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. బస్సు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News