Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది.
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక.. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కేసీ వేణుగోపాల్‌కు వేం నరేందర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని అభినందించారు ఖర్గే.