Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మరో విద్యా కుసుమం నేల రాలింది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి
Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో మరో విద్యా కుసుమం నేల రాలింది. అనారోగ్యం భారీన పడిన విద్యార్ధిని మల్లెపూడి తేజస్విని ప్రాణం కోల్పోయింది. మెదక్ జిల్లా రామచంద్రాపురంకు చెందిన తేజస్విని బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం పీయూసీ చదువుతుంది. తేజస్విని మృతి పట్ల తోటి విద్యార్ధులు ఆందోళనకు దిగారు.
సరైన వైద్యం చేయించినట్టయితే తేజస్విని ప్రాణాలతో బతికి బయటపడేదన్నారు. కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని.. వీసీ రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాసర ఐఐఐటీ కాలేజీకి చురుకుంది. పరిస్థితి పరిశీలించింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.