Vivo Y6 : 7200mAh బ్యాటరీతో Vivo Y6 5G విడుదల.. బ్యాటరీలో ఇదే బాస్.!

Vivo Y6 5G : బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనీస్ బ్రాండ్ వీవో (Vivo), తాజాగా మరో సంచలనానికి ...

Update: 2026-04-24 06:38 GMT

Vivo-Y6

Vivo Y6 5G : బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనీస్ బ్రాండ్ వీవో (Vivo), తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. తమ పాపులర్ Y-సిరీస్‌లో భాగంగా Vivo Y6 5G స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తుంటే టెక్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్న భారీ బ్యాటరీ బ్యాకప్ ఏకంగా పవర్‌బ్యాంక్‌లనే తలదన్నేలా ఉంది.

పవర్‌బ్యాంక్ అవసరమే లేదు : సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5000mAh బ్యాటరీ ఉంటేనే అది పెద్ద బ్యాటరీ అని అంటాం. కానీ వీవో ఒక అడుగు ముందుకు వేసి Vivo Y6 5Gలో ఏకంగా 7,200mAh భారీ బ్యాటరీని అమర్చింది. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా నింపడానికి 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకధాటిగా 15.5 గంటల పాటు నావిగేషన్ (GPS) వాడుకోవచ్చని, దాదాపు 39 గంటల పాటు నిరంతరంగా కాల్స్ మాట్లాడుకోవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. సాధారణ వినియోగదారులకు ఇది 3 నుండి 4 రోజుల పాటు ఈజీగా వచ్చేస్తుంది.

డిస్‌ప్లే , డిజైన్: Vivo Y6 5G ఫోన్ 6.75-అంగుళాల భారీ HD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ , 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కు IP68 , IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే నీటిలో పడినా, దుమ్ము ధూళి తగిలినా ఫోన్ సురక్షితంగా ఉంటుంది. దీనికి తోడు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల కింద పడినా అంత త్వరగా స్క్రీన్ పగిలిపోయే ప్రమాదం ఉండదు.

పర్ఫార్మెన్స్ , స్టోరేజ్ : ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (Snapdragon 4 Gen 2) 4nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఇది 5G కనెక్టివిటీతో పాటు మెరుగైన వేగాన్ని అందిస్తుంది.

ర్యామ్ & స్టోరేజ్: ఇందులో ఏకంగా 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడం అనే సమస్య ఉండదు.

OS: ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓరిజిన్ ఓఎస్ 6 (OriginOS 6) పై పనిచేస్తుంది.

కెమెరా క్వాలిటీ : ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. ఇది పోర్ట్రెయిట్ మోడ్, నైట్ సీన్, స్లో మోషన్ వంటి ఫీచర్లతో అద్భుతమైన ఫొటోలను క్లిక్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బడ్జెట్ ధరలో మంచి ఫొటోలు కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Vivo Y6 5G ప్రస్తుతానికి మూడు వేరియంట్లలో చైనాలో లాంచ్ అయ్యింది..

  • 8GB + 128GB: ధర సుమారు రూ. 24,000 (CNY 1,799).
  • 8GB + 256GB: ధర సుమారు రూ. 27,000 (CNY 1,999).
  • 12GB + 256GB: ధర సుమారు రూ. 30,000 (CNY 2,199).

ఇది గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ , గోల్డ్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీ, అద్భుతమైన డ్రాప్ రెసిస్టెన్స్ , లేటెస్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మీరు గనుక రోజూ ఛార్జింగ్ పెట్టే తలనొప్పి లేని ఒక గట్టి ఫోన్ కోసం చూస్తుంటే, Vivo Y6 5G మీ లిస్టులో ఖచ్చితంగా ఉండాల్సిందే..




Tags:    

Similar News