కొత్త ఫోన్ కొంటున్నారా..? మే వరకు ఆగండి.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Best Upcoming Smartphones in May 2026: వచ్చే నెలలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫోన్ కొనాలని చూస్తుంటే కచ్చితంగా మే నెల వరకు ఆడగం బెటర్.

Update: 2026-04-23 03:54 GMT

కొత్త ఫోన్ కొంటున్నారా..? మే వరకు ఆగండి.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Best Upcoming Smartphones in May 2026: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వచ్చే మే నెలలో మైండ్ బ్లోయింగ్ ఫోన్లు కనువిందు చేయనున్నాయి. అత్యుత్తమ కెమెరాతో అత్యాధునిక టెక్నాలజీ కోరుకునే వారి కోసం ప్రముఖ సంస్థలు తమ శక్తివంతమైన మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఫోటోల కోసం డిజిటల్ కెమెరాలను మరిచిపోయేలా చేసే సరికొత్త ఫోన్లు మీ ముందుకు రానున్నాయి.

మే నెలలో స్మార్ట్‌ఫోన్ల సందడి: వివో, ఒప్పో పోటీ..

వివో నుంచి ఒప్పో సంస్థల వరకు తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఫోన్లు కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాకుండా, హై క్వాలిటీ ఫోటోల కోసం రూపొందించారు.

వివో నుంచి కెమెరా దిగ్గజాలు: మే 6న విడుదల..

వివో తన ప్రీమియం శ్రేణిలో 'వివో ఎక్స్300 ఆల్ట్రా', 'వివో ఎక్స్300 ఎఫ్ఈ' మోడళ్లను మే 6వ తేదీన విడుదల చేయబోతోంది. ఈ ఫోన్లలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, వీటికి బయటి నుంచి ఫిట్ చేసుకునే ఆప్టికల్ పరికరాలకు అనుకూలంగా రూపొందించారు.

కెమెరా ప్రత్యేకతలు: ఆల్ట్రా మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండనున్నాయి.

పనితీరు: ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్, 6.82 అంగుళాల అత్యుత్తమ నాణ్యత కలిగిన స్క్రీన్ అమర్చారు. అలాగే 6600 ఎంఏహెచ్ బ్యాటరీ రోజంతా నిరంతరాయంగా పనిచేసేలా సహకరిస్తుంది.

ఒప్పో నుంచి సరికొత్త ఆవిష్కరణలు..

మరోవైపు ఒప్పో సంస్థ తన 'ఫైండ్ ఎక్స్9 ఆల్ట్రా', 'ఫైండ్ ఎక్స్9ఎస్' మోడళ్లను మే నెలలో భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు ధృవీకరించింది. ఫొటోలు, వీడియోల కోసం కేవలం స్మార్ట్‌ఫోన్‌పైనే ఆధారపడే వారి కోసం ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌ను అమర్చి, దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చిత్రీకరించేలా సాంకేతికతను జోడించారు.

ఎవరు వేచి చూడాలంటే..?

తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం 'వివో ఎక్స్300 ఎఫ్ఈ' మోడల్ రానుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. మొత్తంమీద, స్మార్ట్‌ఫోన్ కెమెరానే ప్రాధాన్యతగా భావించే వారికి మే నెల ఒక పండుగ వంటిదని చెప్పవచ్చు. కాబట్టి, అత్యుత్తమ ఫోన్ కోసం మరికొన్ని రోజులు ఓపిక పట్టడం మంచిది.

Tags:    

Similar News