TCS : ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్..మళ్లీ పాత రోజులు వచ్చినట్టే..!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు విడుదలయ్యాయి. వరుస తగ్గుదలకు బ్రేక్ వేస్తూ 2,356 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది.

Update: 2026-04-10 03:07 GMT

TCS Q4 Results Recruitment

TCS Q4 Results : దేశీయ ఐటీ రంగంలో నిశ్శబ్దం వీడింది. గత కొంతకాలంగా లేఆఫ్‌లు, నియామకాల తగ్గింపుతో ఆందోళనలో ఉన్న ఐటీ నిపుణులకు దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అదిరిపోయే తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు, ఉద్యోగుల నియామకాల్లో టీసీఎస్ చూపిన దూకుడు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వరుస బ్రేకులకు ఎండ్ కార్డ్

గత రెండు త్రైమాసికాలుగా టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) తగ్గుతూ వస్తుండటంతో సాఫ్ట్‌వేర్ రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, క్యూ4 ఫలితాల్లో ఈ ట్రెండ్‌కు టీసీఎస్ చెక్ పెట్టింది. ఈ క్వార్టర్‌లో ఏకంగా 2,356 మంది కొత్త ఉద్యోగులు కంపెనీలో చేరారు. ప్రస్తుతం టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరుకుంది. కేవలం నియామకాలు పెంచడమే కాకుండా, అట్రిషన్ రేటును కూడా నియంత్రణలోకి తీసుకురావడం విశేషం. ఇది కంపెనీపై ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.

లాభాల్లోనూ టాప్ గేర్

ఆర్థికంగా కూడా టీసీఎస్ రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచింది. ఏప్రిల్ 9న విడుదల చేసిన ఫలితాల ప్రకారం..నికర లాభం రూ. 13,718 కోట్లు (గతేడాదితో పోలిస్తే 12% వృద్ధి)గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 10% పెరుగుదల నమోదు చేసింది.

ఫ్రెషర్లకు పండుగే..

ఐటీ దిగ్గజం టీసీఎస్ ఒక నిర్ణయం తీసుకుందంటే అది మిగిలిన కంపెనీలకు మార్గదర్శకంగా మారుతుంది. టీసీఎస్ మళ్లీ నియామకాలు ప్రారంభించడంతో.. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు కూడా తమ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను వేగవంతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు ఇది గొప్ప ఊరట. మొత్తానికి ఐటీ రంగంలో స్తబ్దత వీడి, మళ్లీ గోల్డెన్ డేస్ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. టీసీఎస్ ఇచ్చిన ఈ బూస్ట్ కేవలం ఆ కంపెనీకే పరిమితం కాకుండా, మొత్తం ఇండియన్ ఐటీ ఎకోసిస్టమ్‌లో కొత్త జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News