ఫోన్ ఛార్జ్ అయ్యాక ప్లగ్‌లోనే ఛార్జర్ వదిలేస్తున్నారా..? నెలకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలిస్తే షాకే..!

Phone Charging Safety: ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫుల్ అయ్యాక చిన్న పొరపాటు చేస్తుంటాం. చాలామంది కామన్ గా ఇదే చేస్తుంటారు. దీంతో భారీ నష్టాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Update: 2026-04-09 03:21 GMT

mobile phone charger

Mobile Charger Electricity Consumption: చాలామంది ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక మొబైల్‌ను తీసేస్తారు. కానీ, ఛార్జర్‌ను మాత్రం సాకెట్‌లోనే ఉంచేస్తారు. స్విచ్ ఆఫ్ చేయడం కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వృథా కావడమే కాకుండా, మీ ఛార్జర్ ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ఈ అలవాటు వల్ల జరిగే నష్టం, విద్యుత్ వినియోగంపై పూర్తి వివరాలు తెలుసుకంటే కచ్చితంగా షాక్ అవుతారు.

సాకెట్‌లో ఉన్న ఛార్జర్ విద్యుత్ ఖర్చు చేస్తుందా..?

చాలామంది అభిప్రాయం ప్రకారం.. ఫోన్ కనెక్ట్ చేయనప్పుడు ఛార్జర్ విద్యుత్తును తీసుకోదు. కానీ ఇది నిజం కాదు. ఛార్జర్‌ను సాకెట్‌లో ఉంచి స్విచ్ ఆన్ చేసినప్పుడు, అందులోని ట్రాన్స్‌ఫార్మర్ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. దీనిని సాంకేతిక భాషలో 'వ్యాంపైర్ పవర్' లేదా 'ఫాంటమ్ లోడ్' అని పిలుస్తారు. అంటే మనకు తెలియకుండానే అది విద్యుత్తును ఖర్చు చేస్తుంది.

నెలవారీ లెక్కలు చూస్తే పరేషానే..

తాజా నివేదికల ప్రకారం, ఒక ఛార్జర్ రోజంతా సాకెట్‌లో ఉంటే సుమారు 7.2 వాట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. దీనిని యూనిట్లలోకి మారిస్తే, ఒక ఛార్జర్ ద్వారా నెలకు ఒకటి లేదా రెండు రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. వినడానికి ఇది చాలా తక్కువ మొత్తంగా అనిపించవచ్చు. కానీ, భారతదేశం వంటి పెద్ద దేశంలో కోట్ల మంది ఇలాగే ఛార్జర్లను వదిలేయడం వల్ల ప్రతి ఏటా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ వృథా అవుతోందని అంచనా. మీ ఒక్కరి పరంగా చూస్తే ఇది చిన్న విషయమే కావొచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఇది భారీ నష్టాన్ని కలిగిస్తోంది.

విద్యుత్ ఖర్చు మాత్రమే కాదు.. ఇతర ప్రమాదాలు కూడా..!

కేవలం డబ్బులు వృథా అవడమే కాకుండా, ఛార్జర్‌ను నిరంతరం సాకెట్‌లో ఉంచడం వల్ల మరికొన్ని సమస్యలు తలెత్తుతాయి:

వేడెక్కడం: నిరంతరం విద్యుత్ ప్రసారం జరగడం వల్ల ఛార్జర్ లోపలి భాగాలు వేడెక్కి, త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

షార్ట్ సర్క్యూట్: నాణ్యత లేని ఛార్జర్లు వాడేటప్పుడు, అవి వేడెక్కి అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు.

పిల్లలకు ప్రమాదం: సాకెట్‌లో స్విచ్ ఆన్ చేసి ఉన్న ఛార్జర్ పిన్ పిల్లల చేతికి దొరికితే విద్యుత్ఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంది.

సరైన పద్ధతులు పాటించండి..

మీ విద్యుత్ బిల్లును ఆదా చేయడంతో పాటు, పరికరాల భద్రత కోసం ఈ సూచనలు పాటించండి. ఛార్జింగ్ పూర్తయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్‌ను తీసివేయడం అలవాటు చేసుకోండి. అలాగే, మొబైల్ ఛార్జింగ్ కోసం ఎక్కువ పొడవు ఉన్న వైర్ ను కాకుండా, కంపెనీ అందించిన చిన్న వైర్ ఉన్న వాటిని వాడటం వల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. ఈ చిన్న మార్పులు మీ భద్రతకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.

Tags:    

Similar News