Karaoke Projector: రూ. 8వేల లోపే భారత్‌లో తొలి 'కరోకే' ప్రొజెక్టర్.. 4K డిస్ ప్లేతోపాటు మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు..!
Karaoke Projector: భారతీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి లైఫ్‌లాంగ్ సంస్థ వినూత్నమైన లైఫ్ లాంగ్ రోర్ ప్రొజెక్టర్‌ను పరిచయం చేసింది. ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారంతే.
Karaoke Projector
Karaoke Projector: వినోద ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ లైఫ్‌లాంగ్ సంస్థ 'రోర్' పేరుతో దేశంలోనే మొట్టమొదటి కరోకే ప్రొజెక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 7,999 ధరకే లభించే ఈ పరికరం, మీ ఇంటినే ఒక సినిమా హాల్‌గా మార్చేయడమే కాకుండా, మీరు ఇష్టమైన పాటలు పాడుకోవడానికి అద్భుతమైన వేదికను అందిస్తుంది. టెక్నాలజీతోపాటు వినోదం కలగలిసిన అద్భుతం ఈ ప్రోడక్ట్.
ఇంటి వద్దే థియేటర్ అనుభూతి..
భారతీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి లైఫ్‌లాంగ్ సంస్థ వినూత్నమైన లైఫ్ లాంగ్ రోర్ ప్రొజెక్టర్‌ను పరిచయం చేసింది. సాధారణంగా ప్రొజెక్టర్లు కేవలం దృశ్యాలను మాత్రమే చూపిస్తాయి. కానీ 'రోర్' అడుగు ముందుకు వేసి సరౌండ్ సౌండ్, కరోకే ఫీచర్‌తో వచ్చింది. కరోకే కొత్త టెక్నాలజీ ద్వారా పాటలోని సంగీతం మాత్రమే ప్లే అవుతుండగా, వినియోగదారులు మైక్రోఫోన్ సాయంతో ఆ పాటను స్వయంగా పాడవచ్చు. ఇది పార్టీలు, కుటుంబ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అద్భుతమైన సౌండ్ తో పిచ్చర్ క్వాలిటీ..
సాధారణ ప్రొజెక్టర్లలో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ఇందులో 20 వాట్ల పవర్ ఫుల్ బాస్ స్పీకర్లు ఉన్నాయి. దీనివల్ల బాహ్య స్పీకర్ల అవసరం లేకుండానే హాల్ అంతటా స్పష్టమైన శబ్దం వినిపిస్తుంది. పిచ్చర్ విషయానికి వస్తే, ఇది 720p నాణ్యతను కలిగి ఉండి, 4Kతోపాటు పూర్తి హెచ్‌డీ కంటెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. 150 అంగుళాల భారీ స్క్రీన్‌పై సినిమాలు, క్రీడలు వీక్షించడం ఒక అద్భుత అనుభవాన్ని ఇస్తుంది.
వైర్‌లెస్ మైక్రోఫోన్లు..
ఈ ప్రొజెక్టర్‌తో పాటు రెండు వైర్‌లెస్ మైక్రోఫోన్లు లభిస్తాయి. వీటిలో వాయిస్ మోడ్యులేషన్ సదుపాయం ఉండటం వల్ల వినియోగదారులు తమ గొంతును వివిధ రకాలుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు చూసేటప్పుడు వినియోగదారులు తమ సొంత గొంతుతో లైవ్ కామెంటరీ చెప్పుకునే అవకాశం కల్పించడం ఈ పరికరం ప్రత్యేకత.
స్మార్ట్ ఫీచర్లు, యాప్ సపోర్ట్..
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. యాప్ స్టోర్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ప్రొజెక్టర్‌గానే కాకుండా, బ్లూటూత్ స్పీకర్‌గా కూడా పనిచేస్తుంది. లెన్స్‌ను శుభ్రం చేసుకోవడానికి ఇందులో ప్రత్యేకంగా డీఐవై స్లాట్ కూడా అందించారు.
ధర..
అత్యాధునిక హంగులతో రూపొందిన ఈ లైఫ్‌లాంగ్ రోర్ ప్రొజెక్టర్ ధర కేవలం రూ. 7,999 మాత్రమే. ఇది ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. తక్కువ ధరలో ప్రీమియం వినోదాన్ని ఆశించే వారికి ఇది ఉత్తమ ఎంపిక.