Type C: టైప్-సీ ఛార్జర్‌లో 'సీ' అంటే అర్థం తెలుసా? 99శాతం మందికి తెలియని నిజం..!

USB Type C Meaning: ప్రస్తుతం ప్రపంచం అంతా టైప్ సీ ఛార్జింగ్ నే వాడుతోంది. అయితే, దీనిలో గల 'సీ' కి గల అర్థం మాత్రం మనలో చాలమందికి తెలియదు.

Update: 2026-04-06 06:37 GMT

Type C: టైప్-సీ ఛార్జర్‌లో 'సీ' అంటే అర్థం తెలుసా? 99శాతం మందికి తెలియని నిజం..!

USB Type C Meaning: నేడు స్మార్ట్‌ఫోన్ నుంచి ల్యాప్‌టాప్ వరకు ప్రతి పరికరానికి టైప్-సీ ఛార్జింగ్ ఒక ప్రామాణికంగా మారిపోయింది. మనం రోజూ ఈ కేబుల్ ఉపయోగిస్తున్నప్పటికీ, అసలు ఇందులో 'సీ' అనే అక్షరం దేనిని సూచిస్తుందో చాలామందికి తెలియదు. ఇది కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు, ఛార్జింగ్ సాంకేతికతలో జరిగిన ఒక గొప్ప పరిణామ క్రమానికి ఇది నిదర్శనం. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

'సీ' అంటే పూర్తి పేరు ఉందా?

చాలామంది టైప్-సీలో 'సీ' అంటే ఏదైనా పెద్ద అర్థం ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ఎటువంటి ప్రత్యేక పూర్తి పేరు లేదు. ఛార్జింగ్ సాంకేతికతలో ఇది మూడవ తరం ఆవిష్కరణ. దీనికంటే ముందు టైప్-ఏ, టైప్-బి అనే రకాలు ఉండేవి. వరుస క్రమంలో ఇది మూడవది కావడంతో దీనికి 'సీ' అని పేరు పెట్టారు. అలాగే ఈ పోర్ట్ ఆకారం కూడా ఆంగ్ల అక్షరం 'సి' ని పోలి ఉండటం మరో కారణం.

పాత తరం సమస్యలకు పరిష్కారం..

టైప్-ఏ, టైప్-బి ఛార్జర్లను వాడేటప్పుడు వాటిని పోర్టులో కచ్చితమైన దిశలో మాత్రమే పెట్టాల్సి వచ్చేది. పొరపాటున తిప్పి మరోవైపున పెడితే కేబుల్ లేదా ఫోన్ పోర్ట్ పాడైపోయే ప్రమాదం ఉండేది. ఈ ఇబ్బందిని తొలగించడానికి టైప్-సీని రూపొందించారు. దీనిని ఏ వైపు నుంచి అయినా సులభంగా ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఆపిల్ సంస్థ తన పరికరాల్లో ప్రవేశపెట్టిన మార్పుల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ఒకే రకమైన ఛార్జింగ్ ప్రమాణాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాయి. అదే నేటి టైప్-సీ.

కేవలం ఛార్జింగ్ మాత్రమే కాదు..

టైప్-సీ వల్ల కేవలం ఛార్జింగ్ సులభతరం అవ్వడమే కాకుండా, ఇతర అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి:

అధిక వేగం: పాత కేబుల్స్‌తో పోలిస్తే ఇది అత్యంత వేగంగా విద్యుత్తును సరఫరా చేస్తుంది. దీనివల్ల పెద్ద బ్యాటరీలు కూడా త్వరగా ఛార్జ్ అవుతాయి.

వేగవంతమైన డేటా బదిలీ: దీని ద్వారా సెకనుకు పది జీబీ వరకు డేటాను బదిలీ చేయవచ్చు.

కనెక్టింగ్: ఫోన్ ఛార్జింగ్‌తో పాటు, దీనిని టీవీలు, మానిటర్లు, ఇతర డిస్‌ప్లే పరికరాలను అనుసంధానం చేయడానికి కూడా వాడుకోవచ్చు.

భవిష్యత్తులో టైప్-డి వస్తుందా?

ప్రస్తుతానికి టైప్-డీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు టైప్-సీని ఒక విశ్వవ్యాప్త ప్రామాణికంగా ప్రకటించాయి. దీనివల్ల కంపెనీలు పదే పదే డిజైన్ మార్చాల్సిన అవసరం లేదు. కేబుల్ ఆకారం మారకపోయినా, దాని లోపల ఉండే సాంకేతికత మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయవచ్చు. భవిష్యత్తులో వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా అయస్కాంత శక్తితో పనిచేసే ఛార్జింగ్ విధానాలు పెరిగే అవకాశం ఉంది తప్ప, టైప్-సీ పోర్ట్ త్వరగా కనుమరుగు కాదు.

Tags:    

Similar News