Haier Desert Rose AC: కేవలం 10 సెకన్లలోనే ఇళ్లంతా మంచుకురవాల్సిందే.. ఈ ఏఐ ఫీచర్ తో కరెంట్ బిల్లు కూడా సేవ్..!
Haier Desert Rose AC: ఏసీ వాడితే కరెంట్ బిల్లు మోత మోగిపోతుందని అంతా భయపడిపోతుంటాం. కానీ హైయర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఏసీతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Haier Desert Rose AC: కేవలం 10 సెకన్లలోనే ఇళ్లంతా మంచుకురవాల్సిందే.. ఈ ఏఐ ఫీచర్ తో కరెంట్ బిల్లు కూడా సేవ్..!
Haier Desert Rose AC: ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ హైయర్, భారతీయ మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన 'డెజర్ట్ రోజ్' సూపర్ హెవీ డ్యూటీ ఎయిర్ కండిషనర్లను విడుదల చేసింది. మండే ఎండలను తట్టుకునేలా రూపొందించిన ఈ ఏసీలు, కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో పనిచేస్తాయి. కేవలం పది సెకన్లలోనే గదిని చల్లబరిచే అద్భుత సామర్థ్యం వీటి సొంతం. ఈ కొత్త ఏసీ ధర, విశేషాలు ఓసారి చూద్దాం..
దేశంలోని తీవ్రమైన వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైయర్ సంస్థ ఈ డెజర్ట్ రోజ్ శ్రేణిని తీసుకొచ్చింది. ఇందులో వాడిన AI-AtmoX సాంకేతికత వినియోగదారుల సౌకర్యం, విద్యుత్ ఆదాతోపాటు మెరుగైన సేవలపై ఫోకస్ చేసింది. దీంతో గదిలోని ఉష్ణోగ్రతను, బయటి వాతావరణాన్ని, వినియోగదారుల అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించి, దానికి అనుగుణంగా చల్లదనాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల గదిలో ఎప్పుడూ ఒకే రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
స్మార్ట్ కూలింగ్ ఫీచర్లు..
ఈ ఏసీలో అమర్చిన క్లైమేట్ కంట్రోల్ 2.0 ఫీచర్ గది అవసరాలను బట్టి ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా, మీరు ఇంటికి రాకముందే గదిని చల్లబరిచేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఇందులో ఉంది. మీరు మీ నివాసానికి చేరువలో ఉన్నప్పుడు ఈ ఏసీ దానంతట అదే పని ప్రారంభించి, మీరు లోపలికి వచ్చేసరికి చల్లటి వాతావరణాన్ని సిద్ధం చేస్తుంది. అలాగే గదిలో వ్యక్తులు ఎక్కడ ఉన్నారో గుర్తించి, నేరుగా వారిపైకే చల్లటి గాలిని పంపే టార్గెట్ కూలింగ్ వంటి వినూత్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
విద్యుత్ ఆదా..
చాలామంది ఏసీ వాడకానికి భయపడేది భారీగా పెరిగే విద్యుత్ బిల్లుల వల్లే. దీనిని పరిష్కరించడానికి హైయర్ ఇందులో AI ఇకో మోడ్, హ్యూమన్ డిటెక్షన్ (వ్యక్తులను గుర్తించే శక్తి) ఫీచర్లను అందించింది. గదిలో ఎవరూ లేనప్పుడు ఇది ఆటోమెటిక్ గా ఆగిపోతుంది. నిర్వహణ విషయానికి వస్తే, ఏసీ లోపల పేరుకుపోయే దుమ్మును శుభ్రం చేయడానికి ఫ్రాస్ట్ సెల్ఫ్-క్లీన్ సాంకేతికతను ఇందులో వాడారు. ఇది ఏసీ లోపలి భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
ధర..
ప్రీమియం విభాగంలో విడుదలైన ఈ హైయర్ డెజర్ట్ రోజ్ ఏసీ ప్రారంభ ధర రూ. 55,990 గా నిర్ణయించారు. వినియోగదారులు వీటిని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. తక్షణ చల్లదనం, తక్కువ విద్యుత్ ఖర్చు, ఆధునిక సాంకేతికతను కోరుకునే వారికి ఈ ఏసీ ఒక ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.