Kanchili: శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి వేళ ప్రత్యేక పూజలు!
Kanchili: కంచిలి మండలం కర్తలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా గంగాహారతి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
Kanchili: శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి వేళ ప్రత్యేక పూజలు!
కంచిలి, ఆగస్టు 28: కంచిలి మండలం కర్తలి గ్రామంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా గంగాహారతి కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయం వద్ద సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గంగాహారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, పూజా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, ఆడపడుచులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.