Srikakulam: శ్రీకాకుళంలో వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

Srikakulam: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలి దారుణ హత్య కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు అనతి కాలంలోనే ఛేదించారు.

Update: 2026-08-26 15:08 GMT

Srikakulam: శ్రీకాకుళంలో వృద్ధురాలి హత్య కేసు ఛేదించిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా,జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన చింతు చిన్నమ్మడు (W/o Late రామారావు), వయస్సు 70 సంవత్సరాలు హత్య కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు అనతి కాలంలోనే ఛేదించారు అని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు వెల్లడించారు.

కేసులో నిందితులను అరెస్టు చేసి, మృతురాలి వద్ద నుంచి అపహరించిన సుమారు రూ.38 లక్షల విలువైన 24 తులలు బంగారు,6 తులలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల సంక్షిప్త వివరాలు

A1 బెండి అచ్యుతరావు (51) – స్టాంప్ వెండర్, సత్యవరం. (A2 సోదరుడు)

A2 కింతలి ధనలక్ష్మి (53) – నోటరీ అడ్వకేట్, నరసన్నపేట.

A3 కింతలి గణేష్ (25) – అడ్వకేట్, నరసన్నపేట. (A2 పెద్ద కుమారుడు)

A4 బెండి లక్ష్మీనారాయణ (21) – డిగ్రీ విద్యార్థి, సత్యవరం. (A1 కుమారుడు)

A5 కింతలి మణికంఠ (24) – సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్. (A2 చిన్న కుమారుడు).

కేసు పూర్వాపరాలు: మృతురాలు హైదరాబాద్‌లో నివసిస్తూ అప్పుడప్పుడు తన స్వగ్రామమైన అల్లాడపేటకు వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో 11.08.2026న గ్రామానికి వచ్చిన ఆమె, 17.08.2026న గ్రామంలో జరిగిన కార్యక్రమానికి బంగారు ఆభరణాలు ధరించి హాజరై, అనంతరం ఆర్టీసీ బస్సులో నరసన్నపేటకు చేరుకుంది.

అక్కడ సుమారు ఉదయం 11.30 గంటలకు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం నిమిత్తం లాయర్ ధనలక్ష్మి ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో జలుమూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు �

Tags:    

Similar News