Ichchapuram: ఘనంగా శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి శ్రావణ శుక్రవార వేడుకలు

Ichchapuram: ఇచ్ఛాపురం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, లక్కీ డ్రా నిర్వహించారు.

Update: 2026-08-28 15:54 GMT

Ichchapuram: ఘనంగా శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి శ్రావణ శుక్రవార వేడుకలు

ఇచ్ఛాపురం: స్థానిక గ్రామ దేవత, భక్తుల ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రావణ శుక్రవార మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం (రాఖీ పౌర్ణమి) సందర్భంగా వేకువజామున 4:30 గంటల నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక తైలమర్దన, పంచామృతాభిషేకాలు, దివ్యాలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం 4:30 గంటలకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామ పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు.

ఈ సందర్భంగా పూజల్లో పాల్గొన్న మహిళా భక్తుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా నిర్వహించారు. విజేతలకు ప్రథమ బహుమతిగా బంగారం, ద్వితీయ బహుమతిగా వెండి, తృతీయ బహుమతిగా పట్టుచీరను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బహుమతులు, ప్రసాద వితరణను వీకేఆర్ (VKR) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కామేశ్వరి జువెలర్స్ అధినేతలు శ్రీ వెచ్చా సంతోష్ - నీలిమ దంపతులు స్పాన్సర్ చేశారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Tags:    

Similar News