Kanchili: కర్తలి అభివృద్ధికి పెద్దపీట వేస్తాం: ఐటీడీపీ నేత వాసాల రమేష్‌రెడ్డి!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కర్తలి గ్రామంలో ఇంటింటి ప్రచారం విజయవంతంగా పూర్తయింది. ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్‌రెడ్డి ప్రజలతో మాట్లాడారు.

Update: 2026-08-30 17:22 GMT

Kanchili: కర్తలి అభివృద్ధికి పెద్దపీట వేస్తాం: ఐటీడీపీ నేత వాసాల రమేష్‌రెడ్డి!

కంచిలి: కంచిలి మండలం కొల్లూరు పంచాయతీ పరిధిలోని కర్తలి గ్రామం 180వ బూత్‌లో చేపట్టిన ఇంటింటి కార్యక్రమం ఆదివారం వందశాతం పూర్తయింది. ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెలలో సుమారు రూ.3 లక్షల మేర పింఛన్లు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపారు. మరో 15 రోజుల్లో సుమారు రూ.4 లక్షల ఇళ్లను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇళ్లు లేని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

కర్తలి గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇంటింటి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్‌రెడ్డి, మణి, పురుషోత్తం, రాజా, వినోద్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News