Ayush Badoni: ఇక చాలు గంభీర్.. వన్డేల నుంచి అతనిని తన్ని తరిమేయండి.. 5వ స్థానానికి ఈ బక్కోడే కరెక్ట్ మొగుడు..?

Washington Sundar vs Ayush Badoni: జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు, ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టే నైపుణ్యం ఈ స్థానంలో వచ్చే ఆటగాడికి ఉండాలి.

Update: 2026-06-10 14:52 GMT

Ayush Badoni: ఇక చాలు గంభీర్.. వన్డేల నుంచి అతనిని తన్ని తరిమేయండి.. 5వ స్థానానికి ఈ బక్కోడే కరెక్ట్ మొగుడు..?

Ayush Badoni ODI Debut: గత 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియాను వేధిస్తున్న అతిపెద్ద సమస్య మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం. ముఖ్యంగా ఐదో స్థానంలో సరైన బ్యాటర్ కోసం అన్వేషణ ఇంకా సాగుతోంది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్‌తో చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం ఆయుష్ బదోనిపై పడింది.

ఐదో స్థానంలో ప్రయోగాలు విఫలం.. భారత్‌కు తప్పని తలనొప్పి..

వన్డే ఫార్మాట్‌లో ఐదో స్థానం అనేది అత్యంత కీలకమైనది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు, ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టే నైపుణ్యం ఈ స్థానంలో వచ్చే ఆటగాడికి ఉండాలి. గతంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రను సమర్థవంతంగా పోషించినప్పటికీ, ప్రస్తుతం ఆయన ఈ స్థానానికి దూరం కావడం, హార్దిక్ పాండ్యా కేవలం ఫినిషర్‌గా మాత్రమే పరిమితమవ్వడం జట్టును ఇబ్బంది పెడుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఐదో స్థానంలో పంపి యాజమాన్యం పెద్ద ప్రయోగమే చేసింది. కానీ ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. సుందర్ అద్భుతమైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఐదో స్థానానికి ఒక నిఖార్సయిన బ్యాటర్ అవసరం. అక్కడే ఆయుష్ బదోని పేరు తెరపైకి వచ్చింది.

సుందర్ కంటే బదోనినే బెస్ట్..!

దేశవాళీ వన్డే రికార్డులను ఒకసారి పరిశీలిస్తే వాషింగ్టన్ సుందర్ కంటే ఆయుష్ బదోని చాలా ముందు వరుసలో ఉన్నాడు. బదోని ఆడిన 27 దేశవాళీ వన్డేల్లో 36.47 సగటుతో, 93.27 స్ట్రైక్ రేట్‌తో 693 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. మరోవైపు సుందర్ 86 మ్యాచ్‌ల్లో కేవలం 20.86 సగటుతో 1085 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బదోని సగటు సుందర్ కంటే దాదాపు 16 పరుగులు ఎక్కువగా ఉండటమే కాకుండా, అతని స్ట్రైక్ రేట్ కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలిచే సత్తా బదోనికి ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల శ్రీలంక 'ఎ' జట్టుపై భారత్ 'ఎ' తరఫున ఆయుష్ బదోని కేవలం 18 బంతుల్లోనే 24 పరుగులు చేసి ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

యువరాజ్, రైనా తరహాలోనే బదోని ఉపయోగపడతాడా?

గతంలో భారత జట్టుకు ఐదో స్థానంలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి దిగ్గజాలు బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించారు. ఆయుష్ బదోని కూడా సరిగ్గా అదే తరహాలో జట్టుకు ఉపయోగపడగలడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, అవసరమైనప్పుడు 5 నుంచి 6 ఓవర్ల మేర చక్కటి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఉంది. దేశవాళీ వన్డేల్లో బదోని బౌలింగ్ సగటు 29.72గా ఉండగా, ఎకానమీ 4.54 మాత్రమే కావడం విశేషం. ఇది అనుభవజ్ఞుడైన సుందర్ బౌలింగ్ రికార్డులకు సమానంగా ఉంది. జట్టులో ఇప్పటికే కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా వంటి ప్రధాన బౌలర్లు ఉన్నందున, భారత్‌కు ఇప్పుడు కావాల్సింది బ్యాటింగ్ లోతును పెంచే ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్.

ఫ్యూచర్ వన్డే క్రికెట్ డిమాండ్ ఇదే..!

ప్రస్తుత కాలంలో వన్డే క్రికెట్ వేగం పెరిగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే బ్యాటర్ల అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో గ్లెన్ ఫిలిప్స్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆటగాళ్లు ఈ పాత్రను పోషిస్తూ తమ జట్లకు వెన్నుముకగా నిలుస్తున్నారు. ఆయుష్ బదోనికి ఉన్న హిట్టింగ్ నైపుణ్యం, ఇన్నింగ్స్‌ను నిర్మించే చాకచక్యం ఐదో స్థానానికి నూటికి నూరు శాతం సరిపోతాయి. బౌలర్‌ను బ్యాటర్‌గా మార్చాలని చూసే కంటే, ఒక అద్భుతమైన బ్యాటరే అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయడం ఉత్తమం.

వాషింగ్టన్ సుందర్ జట్టుకు ఒక ఉపయోగకరమైన క్రికెటర్ అనడంలో సందేహం లేదు. కానీ రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడాలనేదే భారత లక్ష్యం అయితే మాత్రం ఐదో స్థానానికి ఆయుష్ బదోని అత్యంత సరైన, బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. మరి సెలెక్టర్లు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News