Sri Lanka: ఐపీఎల్ ఆడిన ప్లేయర్లకు షాకిచ్చిన శ్రీలంక

Sri Lanka: వెస్టిండీస్ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-26 05:56 GMT

Sri Lanka: ఐపీఎల్ ఆడిన ప్లేయర్లకు షాకిచ్చిన శ్రీలంక

Sri Lanka: క్రికెట్ అభిమానులకు మరో అసలైన మజా ఇచ్చేందుకు శ్రీలంక, వెస్టిండీస్ సమరానికి కౌంట్‌డౌన్ షురూ అయింది. కరీబియన్ గడ్డపై జరగబోయే ఈ కీలక పర్యటన కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయంతో పాటు.. మూడు ఫార్మాట్లకు సంబంధించిన అత్యంత బలమైన జట్లను అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీలో ఊహించని మార్పు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కుసాల్ మెండిస్‌కు వన్డేలతో పాటు టీ20 జట్ల కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. గతంలో 17 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం మెండిస్‌కు ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న దాసున్ శనక, చరిత్ అసలంకలను పక్కనపెట్టి మరీ మెండిస్‌కు పగ్గాలు అప్పగించడంతో శ్రీలంక క్రికెట్‌లో వీరిద్దరి కెప్టెన్సీ యుగానికి తెరపడినట్లయింది.

జట్టులో ఐపీఎల్ స్టార్ల హవా..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్న ఆటగాళ్లకు వెస్టిండీస్ టూర్‌లో లంక బోర్డు పెద్దపీట వేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక వికెట్లు తీసి అదరగొడుతున్న యువ పేసర్‌ ఈషాన్ మలింగకు వన్డే, టీ20 జట్లలో చోటు దక్కింది. స్టార్ లెగ్ స్పిన్నర్ హసరంగ తిరిగి రెండు జట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ ఆడటానికి అనుమతి లభించని స్లింగింగ్ యాక్షన్ పేసర్‌ నువాన్ తుషారను ఇప్పుడు టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్‌ లసిత్ క్రుస్పుల్లేకు దాదాపు 3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టీ20 జట్టులో స్థానం దక్కింది.

టెస్ట్ జట్టులో మార్పులు

మరోవైపు జూన్ ఆఖరి వారంలో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ముగ్గురు కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. నిషాన్ మధుశంక, రమేష్ మెండిస్, లాహిరు కుమారల రాకతో లంక టెస్ట్ జట్టు మరింత పటిష్టంగా మారింది. కొత్త కెప్టెన్ కుసాల్ మెండిస్ ఆధ్వర్యంలో ఐపీఎల్ ఫామ్‌తో ఊపుమీదున్న లంక కుర్రాళ్లు కరీబియన్ గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.

Tags:    

Similar News