Smriti Mandhana: పాకిస్థాన్‌పై ఫిఫ్టీ.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
Smriti Mandhana: మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
Smriti Mandhana: పాకిస్థాన్‌పై ఫిఫ్టీ.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
Smriti Mandhana: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో స్మృతి 34 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. మాజీ సారథి మిథాలీ రాజ్, ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో కలిసి ఇప్పుడు మంధాన కూడా ఐదు 50+ స్కోర్లు నమోదు చేసింది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. 23 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు 50+ స్కోర్లు చేసింది. 34 ఇన్నింగ్స్‌లలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదుసార్లు 50+ స్కోర్లు చేయగా.. స్మృతి మంధాన 26 ఇన్నింగ్స్‌లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. పూనమ్ రావత్ 15 ఇన్నింగ్స్‌లలోనే మూడు అర్ధ శతకాలు బాదింది. మిథాలీ ఇప్పటికే ఆటకు వీడ్కోలు పలకగా.. ఇప్పుడు పోటీ హర్మన్‌ప్రీత్, మంధాన మధ్యనే ఉంది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు స్మృతి మంధాన మరోసారి శుభారంభం అందించింది. పాకిస్థాన్ బౌలర్లపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్మృతి.. వరుస బౌండరీలతో అదరగొట్టింది. ఈ క్రమంలోనే 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. రమీన్ షమీమ్ బౌలింగ్‌లో బౌండరీ బాది తన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. 44 బంతులు ఎదుర్కొన్న మంధాన 9 ఫోర్లు, 2రెండు సిక్సులతో 68 రన్స్ చేసి అవుట్ అయింది. ప్రపంచకప్ వంటి పెద్ద వేదికపై చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై స్మృతి ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్ భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ 28 బంతుల్లో 31 రన్స్ చేసి క్రీజులో ఉంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు:
5 – మిథాలీ రాజ్ (23 ఇన్నింగ్స్‌లు)
5 – హర్మన్‌ప్రీత్ కౌర్ (34 ఇన్నింగ్స్‌లు)
5 – స్మృతి మంధాన (26 ఇన్నింగ్స్‌లు)
3 – పూనమ్ రావత్ (15 ఇన్నింగ్స్‌లు)