Shreyas Iyer: టీమిండియా చరిత్రలో నేనే అతి దరిద్రమైన కెప్టెన్ నేనే !

Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది.

Update: 2026-07-12 06:55 GMT

Shreyas Iyer: టీమిండియా చరిత్రలో నేనే అతి దరిద్రమైన కెప్టెన్ నేనే !

India vs England T20 2026: ఇంగ్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి ఐదో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియాకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన ఈ మ్యాచ్‌లో.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాల కారణంగా భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. 4-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత్ ముందు 258 పరుగుల హిమాలయమంత భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంత పెద్ద స్కోరును ఛేదించే క్రమంలో టీమిండియా గట్టిగానే ప్రయత్నించింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అర్ధశతకాలతో ఒంటరి పోరాటం చేశారు. మిగిలిన బ్యాటర్ల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో 56 పరుగుల తేడాతో ఓటమి ఖరారైంది.

వరుస పరాజయాలపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వరుసగా రెండు సిరీస్‌లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని తొలి భారత కెప్టెన్‌ను బహుశా నేనేనేమో. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులకు మేము అలవాటు పడకపోవడమే మా వరుస పరాజయాలకు ప్రధాన కారణం. ఈ సిరీస్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అన్నాడు.

పిచ్ కండిషన్స్ ,బౌలర్ల ప్రదర్శనపై అయ్యర్ ముక్కుసూటిగా స్పందించాడు. బ్యాటింగ్‌కు ఇంతగా అనుకూలించే పిచ్‌లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ అవకాశాలను అస్సలు వదులుకోకూడదు. కానీ మేము క్యాచ్‌లు చేజార్చడం వల్ల వాళ్లు అందనంత భారీ స్కోరు బోర్డుపై ఉంచారు. చివరి రెండు మ్యాచ్‌ల్లో మా బౌలింగ్ వైఫల్యం 100 శాతం కనిపిస్తోంది. మ్యాచ్‌లో ఒక బంతికి సగటున మూడు పరుగుల చొప్పున సమర్పించుకుంటే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే ఈ ఘోర పరాజయాల నుంచి తగిన గుణపాఠాలు నేర్చుకుంటామని, లోపాలను సరిదిద్దుకుని తదుపరి సిరీస్‌కు పక్కా వ్యూహాలతో, మరింత బలంగా బరిలోకి దిగుతామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News