IND vs ENG 5th T20I: ట్రాఫిక్‌లో చిక్కుకున్న భారత్.. మ్యాచ్ సమయంలో మార్పు.. బుడ్డోడు అవుట్!
IND vs ENG 5th T20I Playing 11 Out: భారత్, ఇంగ్లండ్ ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
IND vs ENG 5th T20I: ట్రాఫిక్‌లో చిక్కుకున్న భారత్.. మ్యాచ్ సమయంలో మార్పు.. బుడ్డోడు అవుట్!
IND vs ENG 5th T20I: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టు మైదానానికి ఆలస్యంగా చేరుకుంది. టీమిండియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో టాస్ ఆలస్యమైంది. టాస్ సాయంత్రం 6.30కు పడనుండగా.. భారత జట్టు 6.36 సమయంలో స్టేడియానికి చేరుకుంది. దీంతో టాస్‌ను భారత కాలమానం ప్రకారం రాత్రి 7.15 గంటలకు వేశారు. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అయింది. టీమిండియా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా ఆరంభం అయింది.
స్టేడియానికి చేరుకున్న వెంటనే భారత ఆటగాళ్లు సన్నాహాలు ప్రారంభించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాట్, గ్లవ్స్‌తో మైదానంలోకి వచ్చి వార్మప్ చేశాడు. ఆపై టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజు శాంసన్ వచ్చాడు. ఒక జట్టుగా మన భవిష్యత్తుకు ఏది ఉత్తమమో ప్రయత్నించి చూడటానికి ఇదే సరైన సమయం అని తాను భావిస్తున్నానని, అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రేయస్ తెలిపాడు. ఈ సిరీస్‌లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో చివరి టీ20 కోసం జట్టు యాజమాన్యం మార్పులు చేసింది.
యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే తన రనప్‌ను మార్క్ చేసుకుంటున్నట్లు మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ కామెంటరీలో వెల్లడించాడు. అతడు చెప్పినట్లే సూర్యాంశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ పర్యటనను విజయంతో ముగించాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి వైట్ వాష్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే 3 మ్యాచ్‌ల్లో గెలిచిన ఇంగ్లీష్ జట్టు 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని, కాబట్టి చాలా సంతోషంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. 'ఈ రోజు గెలిస్తే మేము ప్రపంచ నంబర్ వన్ అవుతాము. అదే మా టార్గెట్. ఈ సిరీస్ అంతా మేము బాగా ఆడాం. పిచ్‌కు బాగా అలవాటుపడటం, మంచి కమ్యూనికేషన్ ఇక్కడ ముఖ్యం. ఈ ఫార్మాట్‌లో ఆదిల్ రషీద్ తన 150వ మ్యాచ్ ఆడుతున్నాడు. అతడు చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. మాకు రషీద్ చాలా విలువైన ఆటగాడు. అతని నైపుణ్యం, ఆటగాళ్లను బోల్తా కొట్టించే సామర్థ్యం అద్భుతం. అతను జట్టులో ఉండటం చాలా బాగుంది. తుది జట్టులో ఒక మార్పు చేసాం. రెహాన్ స్థానంలో డాసన్ ఆడుతున్నాడు' అని బ్రూక్ చెప్పాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.