IND vs SL: జస్ప్రీత్ బుమ్రా ఔట్.. రంజీ కింగ్‌కు చోటు.. ఇక లంక బ్యాటర్లకు చుక్కలే!
Auqib Nabi Replaces Jasprit Bumrah for Sri Lanka Test series. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
IND vs SL: జస్ప్రీత్ బుమ్రా ఔట్.. రంజీ కింగ్‌కు చోటు.. ఇక లంక బ్యాటర్లకు చుక్కలే!
IND vs SL: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా సిరీస్ మొత్తంకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని టెస్ట్ సిరీస్ నుంచి తప్పించమని బీసీసీఐ వెల్లడించింది. బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ అకీబ్ నబీని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. రంజీల్లో వికెట్ల మీద వికెట్స్ తీస్తున్న నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.
29 ఏళ్ల అకీబ్ నబీ జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్లేయర్. జమ్మూ కశ్మీర్ నుంచి భారత సీనియర్ జట్టుకు ఎంపికైన మూడో క్రికెటర్‌గా అతడు నిలిచాడు. గతంలో పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో నబీ బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టగా.. 2025-26 సీజన్‌లో 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తో కూడా పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉంది.
ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో కూడా అకీబ్ నబీ చోటు దక్కించుకున్నాడు. రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అదే ప్రదర్శనతో ఇప్పుడు సీనియర్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులోనే నబీ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన నబీ.. తుది జట్టులో ఉండడం ఖాయం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
మరోవైపు జస్ప్రీత్ బుమ్రా మోకాలిలో వాపు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉండటంతో అతడిని ఆడించకూడని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పోర్ట్స్ సైన్స్ బృందం నిర్ణయించినట్లు సమాచారం. ముందున్న అంతర్జాతీయ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఆడడం కూడా సందిగ్ధంగానే ఉంది. ఇటీవల ఇండియా-ఏ తరఫున శ్రీలంక పర్యటనలో కాలికి గాయం కాగా.. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన తర్వాతే శ్రీలంక టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు.
శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్ క్లియరెన్స్ చేస్తేనే), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మనవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, అకీబ్ నబీ.