T Dilip: మాటలు రావడం లేదు.. చాలా బాధగా ఉంది.. మాజీ ఫీల్డింగ్ కోచ్ భావోద్వేగం!

T Dilip: Former India Fielding Coach T Dilip Pens Emotional Farewell. భారత క్రికెట్ జట్టుతో ఐదేళ్ల అనుబంధానికి ముగింపు పలికిన దిలీప్ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.

Update: 2026-08-03 13:36 GMT

T Dilip: మాటలు రావడం లేదు.. చాలా బాధగా ఉంది.. మాజీ ఫీల్డింగ్ కోచ్ భావోద్వేగం!

T Dilip: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ పదవీకాలం ఇటీవల జింబాబ్వే పర్యటనతో పూర్తయింది. జింబాబ్వే పర్యటన అనంతరం ఆయన ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించకపోవడంతో.. టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలి కాలంలో దిలీప్ సేవలపై అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ.. అతడిపై వేటు వేసింది. ఆయన స్థానంలో మాజీ అసోం క్రికెటర్ శుభదీప్ ఘోష్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లోనే ఘోష్ తన తొలి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనున్నాడు. అయితే భారత క్రికెట్ జట్టుతో ఐదేళ్ల అనుబంధానికి ముగింపు పలికిన దిలీప్ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.

సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన టీ. దిలీప్.. భారత జట్టుతో గడిపిన ఐదేళ్ల ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టమని పేర్కొన్నారు. 'కోచ్‌గా ఐదేళ్ల ప్రయాణాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. జర్నీని ఒక్క మాటలో చెప్పడం కష్టం. ఈ జట్టులో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజూ శాయశక్తులా కృషి చేయాలనే లక్ష్యంతో పనిచేశాను. ఫీల్డింగ్ ద్వారానే నేను ప్రేమించే క్రికెట్‌కు సేవ చేసే అవకాశం దక్కింది. భారత జట్టు ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం' అని దిలీప్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన 'ఫీల్డింగ్ మెడల్' సంప్రదాయాన్ని కూడా దిలీప్ గుర్తు చేసుకున్నాడు. 'ప్రతి మ్యాచ్ అనంతరం ఇచ్చే బెస్ట్ ఫీల్డింగ్ మెడల్‌కు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో ప్రతి మ్యాచ్ అనంతరం అత్యుత్తమ ఫీల్డర్‌కు మెడల్ అందించే కార్యక్రమం ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. ఆ మెడల్‌కు ఆటగాళ్లు ఇచ్చిన ప్రాధాన్యం, డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించిన ఆనందం, చిరునవ్వులు ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి. ఆ జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేను' అని ఆనందం వ్యక్తం చేశాడు.

తన పదవీకాలంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా దిలీప్ గుర్తు చేసుకున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ టైటిల్, 2026 టీ20 ప్రపంచకప్ ట్రోఫీ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 అండ్ 2025 ఆసియా కప్ విజయాల్లో భాగం కావడం గర్వకారణమని తెలిపాడు. అలాగే 2023 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని మాటల్లో చెప్పనేనన్నాడు.

తమపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవమని పేర్కొన్నారు. 'భారత్ జెర్సీని ధరించి ఐదేళ్ల పాటు దేశానికి సేవ చేసే అవకాశం రావడం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని గౌరవం. ఈ అధ్యాయం ముగిసినా.. నా ప్రయాణం మాత్రం ఇక్కడితో ఆగదు' అంటూ దిలీప్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News