IND vs SL 2nd Test: రెండో టెస్టుకు శ్రీలంక జట్టులో కీలక మార్పులు.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు.. భారత్‌కు తిప్పలు తప్పవా?

IND vs SL 2nd Test: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది

Update: 2026-08-22 04:00 GMT

IND vs SL 2nd Test: రెండో టెస్టుకు శ్రీలంక జట్టులో కీలక మార్పులు.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు చోటు.. భారత్‌కు తిప్పలు తప్పవా?

IND vs SL 2nd Test: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ విజయం సాధించి.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

దీంతో సిరీస్‌ను సమం చేయాలంటే రెండో టెస్టులో శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు శ్రీలంక జట్టు కీలక మార్పులు చేసింది. జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.

ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సాహన్ అరాచ్చిగే, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమిల్ మిషారాలను శ్రీలంక జట్టు రెండో టెస్టు కోసం స్క్వాడ్‌లోకి తీసుకుంది. రమేశ్ మెండిస్‌ స్థానంలో సాహన్.. నిషాన్ ఫెర్నాండో స్థానంలో మిషారా జట్టులోకి వచ్చారు.

తొలి టెస్టులో పెద్దగా రాణించలేకపోయిన ఫెర్నాండో స్థానంలో మిషారాకు అవకాశం కల్పించారు. అరాచ్చిగేకు భారత్‌పై ఆడిన అనుభవం కూడా ఉంది. ఇటీవల భారత్-ఏతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాడు.

భారత్-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో 209 పరుగులతో శ్రీలంక తరఫున రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో భారత బ్యాటర్ సాయి సుదర్శన్ 332 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అరాచ్చిగే ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.

కమిల్ మిషారాకు రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. గాలె టెస్టులో నిషాన్ ఫెర్నాండో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో.. అతడి స్థానంలో మిషారా ఆడనున్నాడు. సిరీస్‌ను సమం చేయాలంటే శ్రీలంక బ్యాటింగ్ విభాగం మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది.

దీంతో మిషారా చేరికతో టాప్ ఆర్డర్‌కు మరింత బలం చేకూరుతుందని శ్రీలంక మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గాయంతో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు దినేశ్ చండీమాల్ స్థానంలో పసిందు సూరియబండారా జట్టులో కొనసాగనున్నాడు. అతడిని స్క్వాడ్ నుంచి తప్పించకుండా కొనసాగించాలని శ్రీలంక నిర్ణయించింది.

రెండో టెస్టులో శ్రీలంక జట్టు కూర్పు తొలి మ్యాచ్‌తో పోలిస్తే పటిష్టంగా మారింది. ఇద్దరు కొత్త ఆటగాళ్ల చేరికతో లంక బ్యాటింగ్ బలపడింది. ముఖ్యంగా కమిల్ మిషారా టీమిండియా స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కోనున్నాడు.

సాహన్ అరాచ్చిగే తుది జట్టులో ఉంటే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంకకు అదనపు బలం కానుంది. రెండో టెస్టులో శ్రీలంక పక్కా ప్రణాళికతో బరిలోకి దిగనుంది. భారత్‌కు తిప్పలు తప్పేలా లేవు.

రెండో టెస్టు కోసం శ్రీలంక జట్టు ఇదే:

లహిరు ఉదారా, కమిల్ మిషారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సాహన్ అరాచ్చిగే, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, కేశర నువంత, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, లహిరు కుమార, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో.

Tags:    

Similar News