Team India: టీమిండియా క్రికెటర్ కోసం లక్షల జాబ్ మానేసిన యువతి
Team India: భారత యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ మణికపూర్‌కు చెందిన అక్షిత రాజ్‌తో ఏడడుగులు వేశారు.
Team India: టీమిండియా క్రికెటర్ కోసం లక్షల జాబ్ మానేసిన యువతి
Akash Deep Wedding: భారత క్రికెట్ జట్టులో తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఓ ఇంటి వాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ యువ పేసర్.. మణికపూర్‌కు చెందిన అక్షిత రాజ్‌తో కలిసి ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా, పవిత్రంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఆధ్యాత్మిక నగరమైన కాశీ పుణ్యక్షేత్రం వేదిక కావడం విశేషం. వారణాసిలోని అత్యంత విలాసవంతమైన 'తాజ్ గంగెస్' హోటల్‌లో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది.
ఆకాష్ దీప్ బీహార్‌లోని రోహతాస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. వధువు అక్షిత రాజ్ కూడా అదే జిల్లాలోని మణికపూర్ నివాసి. ఆమె తండ్రి అమిత్ కుమార్ సింగ్. అక్షిత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ కాలంలో సెలబ్రిటీలు లవ్ మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతుంటే.. వీరిద్దరిదీ మాత్రం పూర్తిగా పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం.
చదువులో ఎంతో ప్రతిభావంతురాలైన అక్షిత రాజ్.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీసీఏ, ఎంసీఏ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఒక ప్రముఖ ఐటీ కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో కూడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది.
అయితే, సరిగ్గా అదే సమయంలో ఆకాష్ దీప్‌తో పెళ్లి సంబంధం కుదిరింది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఉద్యోగం కంటే కుటుంబ బాధ్యతలకు, కాబోయే భర్త క్రికెట్ కెరీర్‌కు అండగా నిలవడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో తనకు వచ్చిన భారీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాన్ని అక్షిత సంతోషంగా వదులుకుంది.
ఆకాష్ దీప్ క్రికెట్ ప్రతిభను గుర్తించిన బీహార్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ఆయనకు గౌరవప్రదమైన డీఎస్పీ పదవిని ఇచ్చి గౌరవించింది. అటు ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం, ఇటు పెళ్లి ఘడియలు ఒకేసారి రావడంతో ఆకాష్ దీప్ సొంత గ్రామం బడ్డిలో గత కొన్ని రోజులుగా పండగ వాతావరణం నెలకొంది.
సాధారణంగా టీమిండియా క్రికెటర్ల పెళ్లిళ్లు అంటే మీడియా హడావిడి, సెలబ్రిటీల సందడి విపరీతంగా ఉంటుంది. కానీ, ఆకాష్ దీప్ మాత్రం అందుకు భిన్నంగా తన పెళ్లిని ఎంతో ప్రైవేట్‌గా ఉంచుకోవాలని ఆశపడ్డాడు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మీడియా కంటికి పడకుండా ఈ వివాహాన్ని ఎంతో ప్రశాంతంగా కానిచ్చేశారు.
ఒకేసారి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి, కాశీ సాక్షిగా అందమైన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆకాష్ దీప్-అక్షిత జంటకు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.