Extramarital Affair: భార్య భాగోతాన్ని పట్టించిన వాట్సాప్ స్టేటస్..భర్త ఏం చేశాడంటే..?

Extramarital Affair: హర్యానాలోని హిసార్ జిల్లాలో కలకలం రేపిన మోసపూరిత ఘటన.

Update: 2026-07-10 07:51 GMT

Extramarital Affair: భార్య భాగోతాన్ని పట్టించిన వాట్సాప్ స్టేటస్..భర్త ఏం చేశాడంటే..?

Extramarital Affair: సమాజంలో వివాహ బంధానికి ఉన్న పవిత్రత రోజురోజుకూ నవ్వులపాలవుతోంది. క్షణిక సుఖాల కోసం, అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తలను, కన్న పిల్లలను నడిరోడ్డున వదిలేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా హర్యానాలోని హిసార్ జిల్లాలో పెళ్లయి రెండు దశాబ్దాలు గడిచినా, ఇద్దరు పిల్లలు ఉన్నారనే కనీస బాధ్యత కూడా లేకుండా ఒక మహిళ చేసిన నిర్వాకం ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది.

జగాన్ గ్రామానికి చెందిన మనీష్ కుమార్‌కు 2006లో రేఖ అనే మహిళతో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సంసారం సజావుగానే సాగుతున్న తరుణంలో, 2023లో మనీష్ ఉద్యోగ రీత్యా భివానీ ప్రాంతానికి మారాల్సి వచ్చింది. అదే సమయంలో వీరి జీవితంలోకి సతీష్ అనే వ్యక్తి ఎంటరయ్యాడు. మనీష్ ఇంట్లో లేని సమయం చూసి తరచూ వస్తూ రేఖతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

గత ఏడాది నవంబర్‌లో రేఖ తన తండ్రి, సోదరుడి సహాయంతో అకస్మాత్తుగా ఇల్లు వదిలి మాయమైంది. కంగారుపడిన భర్త పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, అసలు ట్విస్ట్ డిసెంబర్ 1న ఎదురైంది. తన అత్త తరపు బంధువుల సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లను చూసి మనీష్ ఒక్కసారిగా స్పృహతప్పినంత పనయ్యాడు. అందులో అతని భార్య రేఖ.. ప్రియుడు సతీష్‌తో కలిసి రాజస్థాన్‌లోని ఒక గుడిలో చాలా ఘనంగా రెండో పెళ్లి చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి.

విషయం తెలిసిన వెంటనే మనీష్ తన వృద్ధురాలైన తల్లిని, ఇద్దరు కొడుకులను తీసుకుని నేరుగా రాజస్థాన్‌లోని ఆ గుడికి చేరుకున్నాడు. అక్కడ రేఖ, సతీష్ ఇద్దరూ దండలు మార్చుకుని, ఏడడుగులు వేసి ఫొటోషూట్‌లు కూడా చేయించుకుంటున్నారు. ఈ అక్రమ పెళ్లిని మనీష్ గట్టిగా నిలదీయగా.. రేఖ కుటుంబ సభ్యులు, ప్రియుడు కలిసి అతడిని తీవ్రంగా దూషించి, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి తరిమేశారు.

ఈ ఘోరమైన మోసం వెనుక కేవలం అక్రమ సంబంధమే కాకుండా.. పెద్ద ఆర్థిక కుట్ర కూడా దాగి ఉందని బాధితుడు ఆరోపించాడు. అత్త తరపు వారు ప్లాన్ ప్రకారం మనీష్‌కు చెందిన భూమిని, పక్కా ఇళ్లను నమ్మించి అమ్మించేశారు. ఆ వచ్చిన కోట్ల రూపాయల సొమ్మునంతా కాజేసి రేఖను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో మనీష్ తన ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లితో కలిసి పూర్తిగా రోడ్డున పడ్డాడు. ఈ మోసాన్ని తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.

ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన తర్వాత మనీష్ ఎలాగైనా నిందితులకు శిక్ష పడేలా చేయాలని ధైర్యం తెచ్చుకున్నాడు. భార్య రెండో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోల సాక్ష్యాలను పక్కాగా సేకరించి.. తన న్యాయవాది ద్వారా హిసార్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. నిందితురాలైన భార్య రేఖ, ఆమె ప్రియుడు సతీష్‌తో పాటు ఈ మోసానికి సహకరించిన రేఖ తండ్రి, సోదరుడు, వదిన, తల్లి, సోదరి పూనమ్‌లపై చట్టపరమైన నోటీసులు జారీ చేసింది. నిందితులంతా ఈ ఏడాది నవంబర్ 25 లోగా కోర్టుకు హాజరై తమ వివరణ ఇచ్చుకోవాలని న్యాయమూర్తి కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News